
ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సీతారాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు, సీతతో కలిసి మధ్యాహ్నం వేళ మద్యం సేవించేవాడని అన్నారు. ఇది సత్యమని, వాల్మీకి రచించిన రామాయణంలోని ఉత్తరకాండలో ఈ విషయం ఉందని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవాన్ వ్యాఖ్యలు సమాజాంలో అశాంతిని నింపేలా ఉన్నాయని మండిపడ్డాయి. భగవాన్ వాల్మీకి రాసిన రామాయణంలో ఈ విషయం ఉన్నట్లు రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే కేఎస్ భగవాన్ ఇప్పటికే పలుమార్లు సీతారాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో రాముడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని వ్యాఖ్యానించారు. సీతను కూడా తీసుకొమ్మని బలవంతం చేసేవాడని వెల్లడించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
One Comment