
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా రాష్ట్ర బడ్జెట్‌పై భారీ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. అన్ని శాఖలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, వాటి వినియోగం, వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రతిపాదనలు నిర్ణీత ఫార్మాట్‌లో పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More : సీటు బెల్టు పెట్టుకోకుండా రిషీ సునాక్ ప్రయాణం.. వంద పౌండ్ల జరిమానా ! –
వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దాదాపు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. వీటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కొన్ని రోజులుగా 2023-24 బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 2022-23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి.. అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
More Read : నేను ఎవరికీ అనుకూలం కాదు.. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి-మాణిక్ రావు ఠాక్రే –
ఈ లెక్కన 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 2.85 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద పీట వేయనున్నారు. ఇందుకోసం దాదాపు 37వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ ను మార్చి మొదటివారంలో ప్రవేశపెడుతుంటారు. అయితే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున ఈ సారి బడ్జెట్ ను ముందే ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి …
-
ఒక్కటైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి –
-
విశాఖ బ్రాండిక్స్‌పై ఎన్జీటీ కొరడా…కార్మికులు రూ.లక్ష పరిహారం –
-
నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై బీఆర్ఎస్ నేతల దాడి –
-
లక్డీకపూల్ లో ఉపాధ్యాయ దంపతుల మౌనదీక్ష.. చిన్నారులను కూడా అరెస్టు చేసిన పోలీసులు –
-
సికింద్రాబాద్ అగ్నిప్రమాద జరిగిన భవనంలో అస్థిపంజరం గుర్తింపు ! ! ! –
2 Comments