
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : తెలంగాణపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం .. అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను హైదరాబాద్ కు పంపించింది. ఆయన కాంగ్రెస్ నేతల మధ్య రాజీ కుదిర్చే పనిలో సక్సెస్ అవుతున్నారనే అనిపిస్తోంది. ఎందుకంటే అసలు గాంధీభవన్లో అడుగుపెట్టనని చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా కాలం తర్వాత గాంధీభవన్ రావడం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏకాంతంగా చర్చలు జరపడం చూస్తుంటే మాణిక్ రావు దౌత్యం ఫలిస్తున్నట్లే అనిపిస్తుంది.
Read More : లక్డీకపూల్ లో ఉపాధ్యాయ దంపతుల మౌనదీక్ష.. చిన్నారులను కూడా అరెస్టు చేసిన పోలీసులు –
మొదటి రోజు కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన మాణిక్ రావు.. శనివారం కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిపిసిసి కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు, పిఈసి సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఛైర్మన్ లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
More Read : 2021లో 611 టన్నుల బంగారం కొనుగోలు చేసిన భారతీయులు –
సమావేశంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ,రేవంత్ పాదయాత్ర ,ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై నేతలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మాణిక్ రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ” నేను ఎవరికీ అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదు. అలాంటి ఆలోచన పక్కన పెట్టండి. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి. ఎముకలు కొరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త పై ఉంది.
Read More : సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. డ్రోన్ కెమెరాతో సెర్చింగ్.. ముగ్గురు సజీవదహనం ! –
హాత్ సే హాత్ జోడో యాత్రతో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకు వెళ్ళండి. నేతలంతా ఐక్యంగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేయండి. రేవంత్ రెడ్డి 50 నియోజక వర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారు. మిగిలిన సీనియర్లు కూడా 20, 30 నియోజక వర్గాల్లో యాత్ర చేయండి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హాత్ సే హాత్ ను ప్రతి ఒక్కరూ సక్సస్ చేయాలి. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయం. సమస్యలు ఉంటే నాతో చెప్పండి. నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు.” అని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి …
-
ఒక్కటైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి –
-
దొంగగా మారిన టీచర్.. సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ –
-
20 రోజుల వ్యవధిలో రవితేజ తలరాత మారింది ! –
-
విశాఖ బ్రాండిక్స్‌పై ఎన్జీటీ కొరడా…కార్మికులు రూ.లక్ష పరిహారం –
-
నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై బీఆర్ఎస్ నేతల దాడి –
2 Comments