
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు దాడి చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని అధికార పార్టీ నేతలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా వెలిసిన MJR టౌన్ వెంచర్లలో రోడ్లు సక్రమంగా లేవని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేసారని బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. —- ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. వెంచర్లో సర్వే చేయడానికి వెళ్లారు.
Read More : దొంగగా మారిన టీచర్.. సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ –
బీజేపీ నేత, నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్ గౌడ్ ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో అధికారులకు వివరిస్తుండగా.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు నిరంజన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నిరంజన్‌కు గాయాలు కావడంతో కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జడ్చర్ల ప్రధాని రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. —- అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మంతో కలిసి నిరంజన్ గౌడ్ పోలీసులకు పిర్యాదు చేసారు. దాడికి పాల్పడిన ఏడుగురు BRS నేతల పై ఫిర్యాదు చేశామని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
4 Comments