
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టనున్నారు. ఈనెల 27న మొదలుకానున్న పాదయాత్ర కోసం పార్టీ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Read More : ప్రగతిభవన్ లో బడ్జెట్ ప్రతిపాదనలపై పై సీఎం కేసీఆర్ సమీక్ష –
పాదయాత్ర ఈనెల 27న కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబాలు పాల్గొంటాయని సమాచారం. అయితే లోకేశ్ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం ఇంత వరకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం అనుమతి లేకుండా బహిరంగ సభలు, పాదయాత్రలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే లోకేశ్ పాదయాత్ర కొనసాగిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు.
More Read : నేను ఎవరికీ అనుకూలం కాదు.. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి-మాణిక్ రావు ఠాక్రే –
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేత , ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. లోకేశ్ తమ టార్గెట్ అని సీఎం జగన్ అన్నారని.. లోకేశ్ పై దాడులు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. లోకేశ్ కు భద్రత కల్పించాలని కోరారు. పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయంతో.. జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
ఇవి కూడా చదవండి …
-
ఒక్కటైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి –
-
సీటు బెల్టు పెట్టుకోకుండా రిషీ సునాక్ ప్రయాణం.. వంద పౌండ్ల జరిమానా ! –
-
నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై బీఆర్ఎస్ నేతల దాడి –
-
లక్డీకపూల్ లో ఉపాధ్యాయ దంపతుల మౌనదీక్ష.. చిన్నారులను కూడా అరెస్టు చేసిన పోలీసులు –
-
సికింద్రాబాద్ అగ్నిప్రమాద జరిగిన భవనంలో అస్థిపంజరం గుర్తింపు ! ! ! –