
క్రైమ్ మిర్రర్, నేషనల్ డెస్క్ : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. శ్రీ గంగా నగర్ జిల్లాలో మూడేళ్ల కూతుర్ని హత్య చేసి కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని విసిరినందుకు వివాహిత మహిళతో పాటు ప్రేమికుడిని అరెస్టు చేశారు. నిందితులను సునీత, సన్నీ అలియాస్ మాల్టాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సునీత అనే మహిళ తన కుమార్తె కిరణ్‌ను గొంతు నులిమి చంపి ప్రియుడు సన్నీ సహాయంతో మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read More : విలాసాలను వదులుకుని సన్యాసం స్వీకరించిన తొమ్మిదేళ్ల చిన్నారి ! –
ఆ తర్వాత దంపతులు శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఉదయం 6:10 గంటలకు రైలు ఎక్కారు. రైలు ఫతుహి రైల్వే స్టేషన్‌కు ముందు వంతెన వద్దకు చేరుకోగానే కాలువలోకి పడేసేందుకు మృతదేహాన్ని కదులుతున్న రైలు నుండి విసిరివేశారు. అయితే మృతదేహం రైలు పట్టాల దగ్గర పడిపోయిందని పోలీసు సూపరింటెండెంట్ (శ్రీగంగానగర్) ఆనంద్ శర్మ అన్నారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. సునీతకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రియుడు సన్నీతో శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్నారు.
More Read : చంద్రబాబు పరువు తీసిన టీడీపీ సీనియర్ నేత –
ముగ్గురు పిల్లలు ఆమె భర్తతో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సునీతను విచారణకు పిలిచారు. విచారణలో తన కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుందని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
-
లోకేశ్ పాదయాత్రకు నందమూరి కుటుంబం? –
-
గవర్నర్ పదవిని కేసీఆర్ అవమానించారు.. ఎలా అవహేళన చేస్తారంటూ తమిళిసై ఆగ్రహం !!! –
-
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
-
20 రోజుల వ్యవధిలో రవితేజ తలరాత మారింది ! –
One Comment