
క్రైమ్ మిర్రర్, నేషనల్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిపి పార్టీని గెలిపించాలని మోదీ సూచించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Read More : కన్నబిడ్డను చంపి కదులుతున్న రైల్లోంచి నదిలోకి తోసేసిన కసాయి తల్లి ! –
ఇందులో భాగంగా ప్రధాని మోదీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్)ను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలను ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రజలతో బలమైన అనుబంధం కోసం ఎన్టీఆర్‌ను మోడీ “ప్రజా నాయకుడు”గా అభివర్ణించారు. అంతేకాదు టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికలలో విజయం సాధించారు.
More Read : చంద్రబాబు పరువు తీసిన టీడీపీ సీనియర్ నేత –
ఇది తెలంగాణ బీజేపీకి స్ఫూర్తిగా నిలవాలి’’ అని మోదీ రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం. ఎన్టీఆర్ కృషి టీడీపీ విజయానికి ఎలా దారితీసిందో కూడా మోడీ హైలైట్ చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ బీజేపీ నాయకులను ఎన్నికల యుద్ధంలో సంకల్పం, ఉత్సాహంతో పోరాడాలని ప్రోత్సహించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపైనే పార్టీ అధినాయకత్వం ప్రధానంగా దృష్టి సారించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి …
-
విలాసాలను వదులుకుని సన్యాసం స్వీకరించిన తొమ్మిదేళ్ల చిన్నారి ! –
-
గవర్నర్ పదవిని కేసీఆర్ అవమానించారు.. ఎలా అవహేళన చేస్తారంటూ తమిళిసై ఆగ్రహం !!! –
-
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
-
20 రోజుల వ్యవధిలో రవితేజ తలరాత మారింది ! –
2 Comments