
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ : వృద్ధాప్య పింఛను పథకం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వృద్ధులకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ప్రభుత్వం వృద్ధులకు ఆసరాగా ఉంటుంది. నెలనెలా పెన్షన్ అందిస్తూ వారికి అండగా నిలబడింది. అయితే 22 ఎకరాలు ఉన్న ఓ వైసీపీ నాయకుడు తన తల్లికి పెన్షన్ ఇప్పించాలని కోరడం విడ్డూరం. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మార్కాపురం సెక్రటేరియట్‌లో ఈరోజు తెల్లవారుజామున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన తల్లికి పింఛన్ రాలేదని వైసీపీ నేత సూర్రెడ్డి సత్యనారాయణరెడ్డి ఆవేశంతో సచివాలయంలో రచ్చ రచ్చ చేశారు. సిబ్బందిపై ఆవేశంతో ఊగిపోయారు.
Read More : లోకేశ్ పాదయాత్రకు నందమూరి కుటుంబం? –
సత్యనారాయణరెడ్డి సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ కార్యాలయంలోని కుర్చీలను విసిరిపారేశారు.సత్యనారాయణరెడ్డి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డికి బంధువు కావడంతో అతడిని అడ్డుకునేందుకు సిబ్బంది భయపడ్డారని సమాచారం. సచివాలయంలో రెడ్డి సీన్ క్రియేట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైర్ అయింది. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సత్యనారాయణ కుటుంబానికి మొత్తం 22 ఎకరాల భూమి ఉందని, అందుకే పింఛను నిలిపివేయాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
-
70 శాతం మంది ఉద్యోగులను తొలగించిన గో మెకానిక్ ! –
-
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –