
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్ : ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ లాంటి భారీ డిజాస్టర్ల తర్వాత మాస్ మహారాజ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. క్రాక్ హిట్ తర్వాత రవితేజ కెరీర్ ఫ్లాపుల బాట పట్టడంతో అభిమానులకు నిరాశే మిగిలింది. కానీ 20 రోజుల వ్యవధిలో రవితేజ రెండు హిట్లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా రెండు హిట్లతో మాస్ మహారాజా మళ్లీ పుంజుకున్నాడు. 2022 చివర్లో ధమాకాతో సూపర్ హిట్ కొట్టాడు రవితేజ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించింది. గత ఏడాదిని హిట్ తో సంతృప్తికరంగా ముగించాడు. ఇక 2023 సంవత్సరాన్ని కూడా మంచి హిట్ తో ప్రారంభించాడు. క్రిస్మస్ సీజన్ రవితేజకు కలిసివచ్చింది. తన కెరీర్ లో రెండు ఫ్లాప్లుల తర్వాత రెండు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.
Read More : 25 కాంగ్రెస్ నేతలకు 500 కోట్ల ఆఫర్ చేసిన కేసీఆర్! –
మొదట ధమాకాతో హిట్ కొట్టిన రవితేజ.. ఇప్పుడు వాల్తేర్ వీరయ్యతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వాల్తేర్ వీరయ్య సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నా సంక్రాంతికి హిట్ గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో రవితేజ కీలక పాత్ర పోషించారు. రవితేజ ఇప్పుడు 20 రోజుల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ విజేతగా నిలిచాడు. ధమాకా, వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలు పండుగ ప్రయోజనాలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. ఈ సినిమాలతో రవితేజ తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టైంది. రవితేజ తదుపరి చిత్రం రావణాసురలో కనిపించనున్నాడు. ఇది కంటెంట్ ఆధారిత చిత్రం. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
-
లోకేశ్ పాదయాత్రకు నందమూరి కుటుంబం? –
-
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
-
70 శాతం మంది ఉద్యోగులను తొలగించిన గో మెకానిక్ ! –
-
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
2 Comments