
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్ : సికింద్రాబాద్ నల్లగుట్టలోని ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూంలో మంటలు చెలరేగి ఎగిసిపడుతున్నాయి. మంటలు పక్క భవనాలకు వ్యాపిస్తున్నాయి. ఉదయం 11 గంటలకు ఆరు అంతస్తుల భవనంలోని కింద గోడోన్ లో మంటలు చెలరేగి పైన వరకు వ్యాపించాయి. పైన ఉన్న స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.15కుపైగా ఫైరింజన్లతో ఆర్పుతున్నా మంటలు అదుపులోకి రావడంలేదు. గత ఐదు గంటలుగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.
Read More : నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఎన్నికలకు మోగిన నగారా.. ఈశాన్యా రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంత? –
మంటలు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు వ్యాపించాయి. భవనం, చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో సహాయక సిబ్బంది భవనంలోకి వెళ్లలేకపోతున్నారు. మంటలు, తీవ్రమైన పొగవల్ల సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది.సమీపంలోని దుస్తుల దుకాణంలోనూ మంటలు వ్యాపించి పొగలు వచ్చాయి. అందులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటుకు తీసుకొచ్చారు.తీవ్రమైన పొగ వల్ల అగ్నిమాపక సిబ్బంది సైతం అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి వద్ద 5 ఆంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు.
More Read : నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఇప్పటికీ ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కలా దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లను రప్పిస్తున్నారు అధికారులు. మంటల ఉధృతికి భవనం సమీపంలోకి వెళ్లలేకపోతున్నారు అగ్నిమాపక సిబ్బంది. మరోవైపు భవనం లోపల నుంచి పేలుడు శబ్ధాలు వినిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలించారు. భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీని ఖాళీ చేయిస్తున్నారు. ఇలాగే మంటలు అదుపులోకి రాకపోతే భవనం కూలిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
Read More : 70 శాతం మంది ఉద్యోగులను తొలగించిన గో మెకానిక్ ! –
చుట్టుపక్కల జనాలు పొగతో ఉకిరిబిక్కిరవుతున్నారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద 5 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. మరోవైపు అగ్నిప్రమాదంపై రాంగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది రక్షించారు. భవనంలో ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. భవనం మూడు వైపుల నుంచి ఫైరింజన్లను మోహరించారు. 12 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. తీవ్రమైన పొగ వల్ల ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి …
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
బీఆర్ఎస్ సభకు వైఎస్ జగన్ ను ఎందుకు ఆహ్వానించలేదు.. అదే కారణమా? –
-
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
-
తెలంగాణలో జగన్ ఎంట్రీ ఇస్తే ప్రకంపనలే! –
-
ప్రేమ వల్ల కాదు.. భయం వల్లే.. మెగా కుటుంబంపై మంత్రి రోజా ఆరోపణలు –
2 Comments