
క్రైమ్ మిర్రర్, నేషనల్ డెస్క్ : గుజరాత్ లోని సూరత్ లో అసాధారణమైన ఘటన జరిగింది. తొమ్మిదేళ బాలిక సన్యాసం స్వీకరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక సంపన్న వజ్రాల వ్యాపారి కుమార్తె సుఖాలను వదులుకుని పూర్తిగా భక్తి మార్గంలో పయనించాలని నిర్ణయించుకుంది. దీనిక కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో వైభవంగా వేడుక నిర్వహించారు. భౌతిక సుఖాలను వదులుకుని ఆ బాలిక సన్యాసం స్వీకరించింది.
Read More : గవర్నర్ పదవిని కేసీఆర్ అవమానించారు.. ఎలా అవహేళన చేస్తారంటూ తమిళిసై ఆగ్రహం !!! –
ధనేష్, అమీ సంఘ్వీల పెద్ద కుమార్తె దేవాన్షి, సూరత్‌లోని వెసు ప్రాంతంలోని ఒక వేదిక వద్ద జైన సన్యాసి ఆచార్య విజయ్ కీర్తియాశ్సూరి , వందలాది మంది సమక్షంలో సన్యాస దీక్ష తీసుకుంది. ఆమె తండ్రి సూరత్‌లో దాదాపు మూడు దశాబ్దాలుగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. డైమండ్ పాలిషింగ్, ఎగుమతి సంస్థ అయిన సంఘ్వి అండ్ సన్స్ యజమాని. దేవాన్షి ఇక సన్యాస జీవితంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు తన కుటుంబం నుంచి వస్తున్న విలాసాలను ఇక మీద వదులుకోనుంది. కుటుంబ స్నేహితుడు నీరవ్ షా చెప్పిన వివరాల ప్రకారం.. దేవాన్షి చాలా చిన్న వయస్సు నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపిందని చెప్పారు.
More Read : 20 రోజుల వ్యవధిలో రవితేజ తలరాత మారింది ! –
అధికారికంగా సన్యాసం స్వీకరించడానికి ముందు ఇతర సన్యాసులతో కలిసి 700 కి.మీ నడిచిందట. ఆమె ఐదు భాషలలో నిష్ణాతురాలని.. ఇతర నైపుణ్యాలను కూడా కలిగి ఉందని చెప్పుకొచ్చారు. దేవాన్షి ‘దీక్ష’ తీసుకునే ఒక రోజు ముందు, నగరంలో కోలాహలంగా మతపరమైన ఊరేగింపు జరిగింది. దేవాన్షి సన్యాసం స్వీకరించిందన్న వార్త జైన్ కమ్యూనిటీలో, ముఖ్యంగా బెల్జియంతో సన్నిహిత వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న వజ్రాల వ్యాపారులలో సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి …
-
లోకేశ్ పాదయాత్రకు నందమూరి కుటుంబం? –
-
25 కాంగ్రెస్ నేతలకు 500 కోట్ల ఆఫర్ చేసిన కేసీఆర్! –
-
70 శాతం మంది ఉద్యోగులను తొలగించిన గో మెకానిక్ ! –
-
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
One Comment