
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ : నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో 4వేల కిలీమీటర్ల మేర పాదయాత్రకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. లోకేశ్ యువగళాన్ని ప్రారంభించేందుకు తెలుగు దేశం పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తాజా సమాచారం ప్రకారం టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే నారా, నందమూరి కుటుంబాలు జనవరి 27న పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది . అక్కడ నందమూరి ఫ్యామిలీ కూడా హాజరవుతుందని సమాచారం. నందమూరి కుటుంబానికి, టీడీపీ అధిష్టానానికి మధ్య మాటలు లేవని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ పాదయాత్ర సందర్భంగా తిప్పికొట్టాలని భావిస్తున్నారు.
Read More : సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
అందుకే పాదయాత్ర ప్రారంభించే రోజు నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం ద్వారా అందరం కలిసే ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 27న కుప్పంలో మెగా పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అగ్ర శ్రేణి నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. పాదయాత్ర 400 రోజులకు పైగా జరగవచ్చునని భావిస్తున్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ అంతటా కాలినడకన 4000 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కీలక రాజకీయ నాయకుడు చేసే సుదీర్ఘ పాదయాత్ర ఇదే.
ఇవి కూడా చదవండి …
- వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
-
70 శాతం మంది ఉద్యోగులను తొలగించిన గో మెకానిక్ ! –
-
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఎన్నికలకు మోగిన నగారా.. ఈశాన్యా రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంత? –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
2 Comments