
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం తొలి సమావేశం ఖమ్మంలో అట్టహాసంగా జరిగింది. ముందుగా అనుకున్నట్లుగా సభకు ఐదు లక్షల మందిని తరలించి సభను సక్సెస్ చేశారు. ఇది జాతీయ స్థాయిలో కేసీఆర్ బలం నిరూపించుకోవడానికి ఏర్పాటు చేసిన సభ. ఇక సభ ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా సమరభేరి మోగించారు సీఎం కేసీఆర్.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు సభకు హాజరయ్యారు.
Read More : తెలంగాణలో జగన్ ఎంట్రీ ఇస్తే ప్రకంపనలే! –
ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపిన కేసీఆర్.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అటు బీజేపీతో కానీ, ఇటు కాంగ్రెస్ తో కానీ దోస్తీ కట్టని వైసీపీ అధినేతకు ఖమ్మం సభకు ఆహ్వానం కూడా లేకపోవడం గమనార్హం. తన కేసుల్లో ఇబ్బందులు వస్తాయనే భయంతో జగన్ గతంలో బీజేపీతో రహస్యంగా దోబూచులాడుతున్నందున కేసీఆర్‌కు జగన్ మీద విశ్వాసం లేకపోయి ఉండచ్చనేది ఒక విశ్లేషణ.
Read More : నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
విభజన హామీలన్నింటిపై జగన్ ఇప్పటికే రాజీ పడ్డారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం , బీజేపీతో పోరాడటానికి జగన్ సహాయం చేస్తారని కేసీఆర్ భావించలేదనేది మరో విశ్లేషణ. కుమారస్వామి, స్టాలిన్, మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కుమారస్వామి , స్టాలిన్‌లు కాంగ్రెస్ తో జతకట్టారు. మమత తాను రెండో సంకీర్ణంలో భాగం కావడానికి ఇష్టపడలేదు. అలాగే, ఆమె కమ్యూనిస్టులు ఉన్న సంకీర్ణంలో భాగం కాలేరు.
ఇవి కూడా చదవండి …
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
యాదాద్రి ఆలయంలో కేసీఆర్ సహా నలుగురు సీఎంలు.. సభకు ముందు నరసింహస్వామికి ప్రత్యేక పూజలు –
-
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
-
ఇద్దరు అధికారులకు విధించిన శిక్షను సవరించిన హైకోర్టు –
-
ప్రేమ వల్ల కాదు.. భయం వల్లే.. మెగా కుటుంబంపై మంత్రి రోజా ఆరోపణలు –
One Comment