
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : తెలంగాణలో గవర్నర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత కొంతకాలంగా తమిళిసై, కేసీఆర్ ఎడమొహం పెడ మొహంగా ఉంటున్నారు. రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ లో గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు తమిళిసై కౌంటరించారు. ‘ తెలంగాణ లో స్వయంగా ముఖ్య మంత్రినే గవర్నర్ పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదు.
Read More : 20 రోజుల వ్యవధిలో రవితేజ తలరాత మారింది ! –
రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడను. మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడను. కానీ తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఎందుకింత చిన్నచూపు. గవర్నర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు. ఇది అహంకారమా?.. లేక మరి ఏంటి?… నేను ఇప్పటికీ చాలాసార్లు గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించాను. కానీ సమాధానం రాలేదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదో ముందు సమాధానం చెప్పాలి. అప్పుడు మాత్రమే దేశంలో ఉన్న రాజంగ్య వ్యవస్థపై మాట్లాడాలి.’తాను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని.. తనకు ప్రోటోకాల్ గురించి బాగా తెలుసునని తమిళిసై అన్నారు. ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.
ఇవి కూడా చదవండి …
-
లోకేశ్ పాదయాత్రకు నందమూరి కుటుంబం? –
-
25 కాంగ్రెస్ నేతలకు 500 కోట్ల ఆఫర్ చేసిన కేసీఆర్! –
-
70 శాతం మంది ఉద్యోగులను తొలగించిన గో మెకానిక్ ! –
-
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..షాపింగ్ మాల్ లో ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది –
-
నెలాఖరులో విశాఖలో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా! –
One Comment