
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. సిఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ 24గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. సబ్ ఇన్స్‌పెక్టర్ వికాస్ సింగ్ సోమవారం రాత్రి తన తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆదివారం షార్ జీరోపాయింట్ రాడార్ సెంటర్ సమీప అడవిలో కానిస్టేబుల్ చింతామణి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అసలేం జరిగింది …. .సిఐఎస్ఎఫ్ జవాన్ విధి నిర్వహణలో ఉండగా జీరో పాయింట్ వద్ద ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతున్న కానిస్టేబుల్ చింతామణిను సిఐఎస్ఎఫ్ ఎస్సై ప్రవీణ్ గమనించి సిఐఎస్ఎఫ్ కమాండ్ కంట్రోల్ కు సమాచారం తెలియజేశాడు.
Read More : ఇద్దరు అధికారులకు జైలు శిక్ష, జరిమానా.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ! –
ఆత్మహత్యకు పాల్పడిన జవాన్ నం.210611225. అతను ఛత్తీస్ గఢ్ మహాసముంద్ జిల్లాకి చెందిన చింతామణిగా సి.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు గుర్తించారు. అతని వయసు 29 ఏళ్లు. నూతన బ్యాచ్ చెందిన చింతామణి సి.ఐ.ఎస్.ఎఫ్ యూనిట్, షార్ లో ఇన్‌స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు . అంతేగాక కోయ్ కమాండర్ బి-కాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సి.ఐ.ఎస్.ఎఫ్.హెడ్ క్వార్టర్ బ్యారక్ లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల నెల రోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకు వెళ్లిన చింతామణి తిరిగి ఈనెల 10న విధుల్లో చేరారు. ఆదివారం షార్ లోని పీసీఎంసీ రాడార్ 1 ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్ కు హాజరయ్యారు.
More Read : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
అనంతరం తను విధుల్లో ఉండగానే ఉరివేసుకొని మృత్యువాత పడ్డాడు. దీనిపై స్థానిక సిఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అతను మానసిక ఒత్తిడికిలోనై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు శ్రీహరికోట సిఐఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ వికాస్ సింగ్ సోమవారం రాత్రి తన తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూమ్ లో సి ఫిష్ట్ లో విధుల్లో ఉన్నాడు వికాస్ సింగ్ . పేలిన శబ్దం రావడంతో తోటి ఉద్యోగులు వచ్చి చూసేసరికి వికాస్ సింగ్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
-
పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం.. జగన్ ఆదేశిస్తే నేను రెడీ-అలీ –
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
2 Comments