
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నాడు. కాలేజీలో తోటి విద్యార్థిని ఇష్టం వచ్చిన రీతిలో కొడుతూ అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది మంగళవారం జరగ్గా.. ఇది పాత వీడియో అని బాధిత విద్యార్థి చెప్పాడు. తామిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పుకొచ్చాడు. అలా చెప్పిన 24 గంటలు గడవక ముందే భగీరథకు సంబంధించిన వీడియో మరొకటి బయటకు వచ్చింది.
Read More : మెదక్ టేక్మాల్ దగ్ధం కేసులో ట్విస్ట్.. సినిమా కథను తలపిస్తున్న స్కెచ్ !
అసలేం జరిగిందంటే.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హైదరాబాద్ లోని మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు. మంగళవారం భగీరథ్ తోటి విద్యార్థిపై దాడి చేసి చెంపలు చెంపలు వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో భగీరథ బాధిత విద్యార్థిని చెంపలు చెంపలు వాయించడం కనిపించింది. రాయలేని పదజాలంతో తిడుతూ కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఎఫ్ ఐఆర్ కూడా నమోదైంది. అయితే భగీరథ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి దీనిపై వివరణ ఇచ్చాడు.
More Read : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
ఇది పాత వీడియో అని తన స్నేహితుడి సోదరిని ప్రేమించాలంటూ ఇబ్బంది పెట్టడంతోనే భగీరథ్ తనను కొట్టాడని చెబుతున్న వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు తాము కలిసిపోయామని.. కావాలనే కొందరు ఈ వీడియోని వైరల్ చేశారని చెప్పుకొచ్చాడు. బుధవారం భగీరథ్ మరో విద్యార్థిని కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఇది కూడా నెట్టింట వైరల్ కావడంతో భగీరథ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ అండ చూసుకునే కొడుకు ఇలా రెచ్చిపోతున్నాడని భగీరథ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే భగీరథ్ ను మహీంద్ర యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి?
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
-
24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..షార్ లో ఏం జరుగుతోంది ? –
One Comment