
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: రిమోట్ ఓటింగ్ విధానం..ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సంస్కరణల్లో ఇదొక విప్లవాత్మక మార్పు అంటోంది ఎన్నికల సంఘం. బతుకు పోరాటం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎంతో మంది వెళుతుంటారు. ఉద్యోగాలు, చిన్నచిన్న పనులు చేసుకుంటూ అక్కడే సెటిలవుతుంటారు. ఎన్నికలు రాగానే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇలా వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు వెళుతుంటారు. ఎక్కడో మైళ్ల దూరాన ఉన్న సొంతూళ్లకు వెళ్లడం అంటే పెద్ద ప్రాసెస్. ప్రయాణ ఖర్చులు తట్టుకోలేక చాలా మంది ఎన్నికల సమయంలో సొంతూళ్లకు వెళ్లడం మానుకుంటారు.
Read More: నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను.. ప్యాకేజి కోసం డ్యాన్స్ చేయను-అంబటి రాంబాబు –
ఇలా ప్రతి ఎన్నికల్లోనూ మూడో వంతు ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఒక సరికొత్త ప్రయత్నమే రిమోట్ ఓటింగ్ మెషీన్ వ్యవస్థ. ఉన్న చోటు నుంచే తమ తమ నియోజకవర్గాల్లో ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ మెషీన్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.రిమోట్ ఓటింగ్ మెషీన్ వ్యవస్థ మౌలికంగా వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బస్సు చార్జీలు, రైలు చార్జీలు పెట్టుకుని ఓటు హక్కు వినియోగించడానికి సొంతూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నివాసం ఉంటున్న ప్రాంతాల్లో వలస వెళ్లిన వారి కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తారు. అక్కడే ఓటు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
More Read : సంక్రాంతి విజేత శృతిహాసన్.. ఎలాగో తెలుసా? –
రిమోట్ ఓటింగ్ మెషీన్ కు సంబంధించి ఇప్పటివరకు ఒక కాన్సెప్ట్ నోట్ ను ఎన్నికల సంఘం రెడీ చేసింది. దీంతో పాటు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ నమూనాను రూపొందించింది. అన్ని రాజకీయ పార్టీలతో తాజాగా జరిగిన సమావేశంలో ఈ నమూనా మెషీన్ ను ఎన్నికల సంఘం ప్రదర్శించింది. రిమోట్ ఓటింగ్ మెషీన్ వ్యవస్థను అమల్లోకి తీసుకరావడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతికపరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంది .
Read More : 14 ఏళ్ల తర్వాత తన తప్పును ఒప్పుకున్న రాజమౌళి !!! –
ఎన్నికల సంఘం.అయితే ఈ రిమోట్ ఓటింగ్ విధానానికి పలు రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉంటే మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న పార్టీల జాబితాలో ఉంది. రిమోట్ ఓటింగ్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పార్టీలో చర్చించి జనవరి 30 లోగా తమ అభిప్రాయాలను తెలియజేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారు. రిమోట్ ఓటింగ్ పద్ధతిని అభివృద్ది చెందిన దేశాలే పక్కన పెట్టాయని.. మన దేశానికి కూడా అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ.. పార్టీలో చిచ్చు రాజేస్తున్న సన్నాహక సమావేశాలు ! –
2 Comments