
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: ఖమ్మంలో బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ బహిరంగ సభ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు హాజరయ్యాయి. ముఖ్యంగా కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు విజయన్ పినరయి, కేజ్రీవాల్, భగవత్ మాన్ సింగ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం 9.45 కు వీరంతా ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఇచ్చారు.
Read More : ఇద్దరు అధికారులకు విధించిన శిక్షను సవరించిన హైకోర్టు –
ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం నలుగురు సీఎంలు, జాతీయ నేతలు కలిసి ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి యాదాద్రి ఆలయం చేరుకున్నారు. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు , అగ్ర నేతలకు ఆలయ త్రితల రాజగోపురం వద్ద అర్చకులు , వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు .
More Read : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
అగ్ర నేతలు ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద హారతి తీసుకున్నారు . మూల విరాట్ స్వయంభు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు , వేద పండితులు సంకల్పం , సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. హారతి , తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు , వేద పండితులు మంత్రోచ్ఛరణలతో వేద ఆశీర్వచనం అందించారు . శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు , అగ్ర నేతలు తిలకించారు .
Read More : ప్రేమ వల్ల కాదు.. భయం వల్లే.. మెగా కుటుంబంపై మంత్రి రోజా ఆరోపణలు –
ఆలయ ప్రాశస్త్యం , ఆధునీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎం లు , నేతలకు వివరించారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో ఖమ్మం సభకు బయల్దేరి వెళ్లారు. నరసింహుని సన్నిధికి కేసీఆర్, కేజ్రీవాల్, అఖిలేష్, భగవంత్ మాన్ వెళ్లగా.. కేరళ సీఎం విజయన్, డి. రాజా వెళ్లలేదు. వారు ప్రెసిడెన్షియల్ సూట్ లోనే ఉండిపోయారు. స్వామికి ప్రత్యేక పూజల అనంతరం అందరూ కలిసి ఖమ్మం చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
జనాభాలో భారత్ నెంబర్ 1 .. వెనుకబడిన చైనా ! –
-
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –