
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్: మెదక్ జిల్లా టేక్మాల్ కారులో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఆడిన నాటకంగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను హత్య చేసి తాను చనిపోయినట్టు నాటకమాడినట్టు తేల్చారు. ఈనెల 9న కారు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ధర్మానాయక్ చనిపోయాడని అందరూ అనుకున్నారు.
Read More : 24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..షార్ లో ఏం జరుగుతోంది ? –
అయితే ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మానాయక్ ఆడిన నాటకంగా గుర్తించారు. ధర్మా నాయక్ పేరిట రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ధర్మానాయక్ అప్పులు చేసి బెట్టింగులు ఆడేవాడు. ఉన్నదంతా పోయి అప్పులపాలయ్యాడు. దీంతో ఎలాగైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనే ఆలోచనతో ధర్మానాయక్ పక్కా స్కెచ్ వేశాడు. కొద్ది రోజుల కిందట తన డ్రైవర్‌తో కలిసి కారులో వెళ్లాడు ధర్మా. మెదక్ జిల్లా టేక్మాల్ వద్దకు రాగానే కారును ఆపి డ్రైవర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతని ప్లాన్ ప్రకారం కారుతో పాటు డ్రైవర్ కూడా సజీవదహనమయ్యాడు.
More Read : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
తానే చనిపోయినట్టు డ్రామా ప్లే చేశాడు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఘటనాస్థలి దగ్గర పెట్రోల్ డబ్బా దొరికింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ధర్మానాయక్ ఆడిన డ్రామా మొత్తం బయటకు తీశారు. ఇదంతా 7కోట్ల ఇన్సూరెన్స్ కోసమే సినిమా స్టోరీ తరహాలో క్రియేట్ చేసినట్టు తేలింది. అయితే కారులో సజీవదహనం అయింది ఎవరు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బతికి ఉండగానే సజీవదహనం చేశాడా?.. చంపి కారులో పెట్టి దహనం చేశాడా?.. అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా నిర్ధారించే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
-
పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం.. జగన్ ఆదేశిస్తే నేను రెడీ-అలీ –
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
One Comment