
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్: మలక్ పేట్ బాలింతల మృతిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగానే బాలింతలు మృతి చెందినట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మలక్ పేట్ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన ఇద్దరు బాలింతలు చనిపోయారు. గత వారం ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వారు మృతి చెందారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులకు పలు రాజకీయ పార్టీ మద్దతు తెలిపాయి.తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం.. జగన్ ఆదేశిస్తే నేను రెడీ-అలీ –
దీంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. బాలింతల మృతి పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక అందించింది. స్టెఫైలో కోకస్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకి బాలింతలు మృతి చెందారని కమిటీ నిర్ధారించింది. అదే ఆసుపత్రిలో మొత్తం 18 మంది డెలివరీ అయ్యారు. అందరికీ ఇన్ఫెక్షన్ సోకడంతో వారికి నిమ్స్ లో చికిత్స అందించారు. ఇద్దరు బాలింతలకు కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకడంతో నిమ్స్ లో డయాలసిస్ చేసినా ఫలితం లేకపోయింది. ఇద్దరు బాలింతలు మృతి చెందారు. మిగతా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
One Comment