
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్: వైసీపీ మంత్రి రోజా తన ప్రత్యర్థులను విమర్శించడంలో ఏ మాత్రం అవకాశం వచ్చినా వదిలిపెట్టరు. తనదైన స్టైల్లో పదునైన బాణాలను సంధిస్తారు. ఇటీవలె టీడీపీ, జనసేన అధినేతలపై తరచూ విరుచుకుపుడుతూ విమర్శలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం పట్ల పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీంతో పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేశారు. ఈ సారి మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేశారు మంత్రి రోజా. మెగా కుటుంబం ఏ విధంగా టాలివుడ్ ని ప్రభావితం చేస్తున్నారో తన మాటల్లో చెప్పుకొస్తూ విమర్శించారు.
Read More : జనాభాలో భారత్ నెంబర్ 1 .. వెనుకబడిన చైనా ! –
ఇటీవల జబర్దస్త్ నటులు వైసీపీ మంత్రులపై విరుచుకుపడ్డారు. మంత్రులకు కనీసం తమ మంత్రిత్వ శాఖలు కూడా తెలియవని ఆరోపణలు చేశారు. దీనికి రోజా ఘాటుగా తిప్పికొట్టారు. ” ఈ జబర్దస్త్ నటులపై మాట్లాడటం సరికాదు. వారు తెలివితక్కువవారు, బలహీనంగా ఉన్నారు. వారి వెనుక ఉన్న వ్యక్తుల గురించి మనం ఆలోచించాలి “.. ఇంకా ఆమె మాట్లాడుతూ ” టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి 7 నుంచి 8 మంది హీరోలున్నారు. మీరు వారికి వ్యతిరేకంగా నిలబడితే, మీకు సినిమా ఆఫర్లు రావు.
More Read : వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
అందుకే జబర్దస్త్ నటీనటులు ఆ మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు ” ఇదంతా పూర్తిగా మెగా ఫ్యామిలీపై ఉన్న భయం వల్లనే తప్ప వారిపై ఉన్న ప్రేమ వల్ల కాదు. మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీ నిజంగా ప్రేమిస్తుంటే, మా ఎన్నికల్లో బలపరిచిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు?.. వైసీపీ మంత్రులపై ఈ మాటల దాడి వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందని, ఆ వ్యాఖ్యలు అర్ధరహితమని మంత్రి రోజా తనదైన స్టైల్ లో కౌంటరిచ్చారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
మెదక్ టేక్మాల్ దగ్ధం కేసులో ట్విస్ట్.. సినిమా కథను తలపిస్తున్న స్కెచ్ !
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
-
ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
5 Comments