
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ ఇద్దరు మంచి స్నేహితులు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆ గట్టు.. ఈ గట్టు అన్నట్లుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండగా.. అలీ వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాలోనూ అలీ ఏదో క్యారెక్టర్ లో తప్పకుండా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఎప్పుడూ ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక వారిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ మీద అలీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Read More : వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమిపై తీవ్రంగా స్పందించారు. అంత మంచి స్నేహితులుగా ఉన్న అలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఏమైంది అనే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అలీ తర్వాత ఏదో కవర్ చేసుకున్నారనుకోండి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున అలీ ప్రచారం చేశారు. జగన్ పార్టీ గెలుపులో తన వంతు సాయం చేశారు ఈ హాస్య నటుడు. అయినా అలీకి ఆశించినంత గుర్తింపు పార్టీలో లభించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు తనకు ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూశారు అలీ. అయితే అలీని కాదని జగన్ వేరే వారికి ఆ పదవిని కట్టబెట్టారు. దీంతో అలీ కొంత హర్ట్ అయ్యారని … ఒకానొక సమయంలో అలీ పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. తర్వాత అలీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు సీఎం జగన్.
More Read : జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
తాజాగా తిరుపతిలో అలీ మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఒకవేళ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ కు పోటీగా తాను నిలబడడానికి సిద్ధమేనని చెప్పారు. పవన్ మంచి మిత్రుడే అయినా సినిమాలు, రాజకీయాలు వేరని చెప్పుకొచ్చాడు. పార్టీ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జగన్ ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీకి రెడీగా ఉన్నానని అలీ అన్నారు. ఇది ఒకప్పుడు పవన్‌కి అత్యంత సన్నిహితులలో ఒకరైన అలీ చేసిన వ్యాఖ్యలని ఊహించని నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అలీ ఇటీవల తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. కాని దానికి జనసేనాని హాజరు కాలేదు. ఇది వారి మధ్య ఉన్న బంధానికి నిదర్శనమని ఇప్పుడు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను.. ప్యాకేజి కోసం డ్యాన్స్ చేయను-అంబటి రాంబాబు –
One Comment