
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బైడెన్ ఉపాధ్యక్షుడు గా పనిచేసిన హయాం నాటి కొన్ని కీలక రహస్య పత్రాలు ఇటీవలికాలంలో వరుసగా దొరికాయి. దీంతో బైడెన్ తీవ్ర వివాదాల్లో చిక్కకున్నారు. ఆయన నివాసంలోనూ, పాత కార్యాలయంలోనూ జరిపిన అన్ని సోదాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని వెల్లడి చేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేసింది. గత డిసెంబరులో బైడెన్ నివాసంలోని కారు గ్యారేజ్ లోనూ, వాషింగ్టన్ లోని మరో పాత కార్యాలయంలోనూ రహస్య పత్రాలు బయటపడ్డాయి.
Read More : ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
తాజాగా బైడెన్ పర్సనల్ లైబ్రరీలో మరొక పత్రం దొరికింది.దీంతో రహస్య పత్రాల అంశం మరింత ముదిరింది. హాట్ టాపిక్ గా మారిన రహస్య పత్రాల్లో ఉక్రెయిన్, ఇరాన్, యూకే కు సంబంధించిన అనేక కీలకమైన అంశాల సమాచారం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇదిలా ఉండగా ఈ రహస్య పత్రాల అంశం పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అవకాశాలున్నట్లు అమెరికా రాజకీయ వర్గాల సమాచారం. దీనిపై అటార్నీ జనరల్ త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వృత్తిరీత్యా లాబీయిస్టు. అనేక చమురు సంస్థల వ్యాపార లావాదేవీలను, ఆయా సంస్థల బాగోగులను చూడటం ఆయన వృత్తి.
More Read : సంక్రాంతి విజేత శృతిహాసన్.. ఎలాగో తెలుసా? –
దీంతో, తండ్రి జో బైడెన్ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని ఉక్రెయిన్ సహా మరికొన్ని దేశాల చమురు కంపెనీలతో హంటర్ కు సంబంధాలున్నాయి. దీంతో హంటర్ బైడెన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఉంటారన్న ఆరోపణలొచ్చాయి. మొత్తానికి వరుసగా దొరుతుకున్న రహస్య పత్రాలు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి అస్త్రంలా మారాయి. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష పదవి రహస్య పత్రాలే కీలకాంశం కానున్నది. బైడెన్ మాత్రం తన కార్యాలయానికి ఏవో ప్రభుత్వ పత్రాలు ఎలా వచ్చాయో తెలియదని అంటున్నారు. నా కార్యాలయంలో ప్రభుత్వ పత్రాలు ఉన్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు.
Read More : రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
అవి అసలు అక్కడికి ఎలా వచ్చాయో తెలియదంటున్నారు. తాను రహస్య పత్రాల విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటానో ప్రజలకు కూడా తెలుసని వెల్లడించారు. ట్రంప్ , బైడెన్ ఇద్దరూ రహస్య పత్రాలను ప్రైవేటు కార్యాలయాలకు తీసుకెళ్లిన వాళ్లే. ట్రంప్ నుంచి 325 పత్రాలు దొరికాయి. అలాగే బైడెన్ వద్ద ఇప్పటి వరకు 10 పత్రాలు బయటపడ్డాయి. అయితే ఇద్దరి దగ్గర దొరికిన పత్రాల్లో టాప్ సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుకు బైడెన్ సహకరిస్తుండగా.. అప్పట్లో ట్రంప్ మాత్రం సహకరించలేదు.
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను.. ప్యాకేజి కోసం డ్యాన్స్ చేయను-అంబటి రాంబాబు –
3 Comments