
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: జనాభాలో మొన్నటి వరకు టాప్ లో ఉన్న డ్రాగన్ కంట్రీ ఇప్పుడు వెనుకబడింది. చైనాను భారత్ అధిగమించిందనే అంచనాలు వెలువుడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన చైనాలో జననాల రేటు తగ్గినట్టు ఇటీవల ఆ దేశమే వెల్లడించింది. దీంతో చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా దూసుకుపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం 2022 చివరి నాటికే భారత్ జనాభా 141.7 కోట్లు కాగా తాజాగా ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్లు అంచనా వేసింది.
Read More : వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
మాక్రోట్రెండ్స్ లెక్కల ప్రకారం భారత జనాభా 142.8 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇది చైనా ఇటీవల ప్రకటించిన జనాభా 141.2 కోట్లు కంటే ఎక్కువ. ఇటీవల చైనా తమ దేశ జనాభా తగ్గినట్టు ప్రకటించింది. జననాల రేటు తగ్గుతుండటం.. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుండటమే కారణంగా చెప్పింది. 2021 కంటే 2022 చివరి నాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని జనవరి 17న తెలిపింది. ప్రస్తుతం అక్కడి జనాభా 141.8 కోట్లుగా ఖరారు చేసింది. ఈ రికార్డును భారత్ 2023 చివరి నాటికి దాటుతోందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కానీ దానికి ముందుగానే భారత్ ఈ రికార్డును అధిగమించింది.
More Read : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
ఇక ప్రపంచ జనాభా విషయానికి వస్తే.. ఇటీవలె 800 కోట్ల మైలురాయిని దాటింది. 2022 నవంబర్ 15 రోజున పుట్టిన బిడ్దతో జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కేవలం 48 ఏళ్లలోనే .. అంటే 1974లో 400 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా రెట్టింపై 800 కోట్లకు చేరుకుంది. వైద్యం సహా అన్ని రంగాల్లో ముందంజ వేయడం వల్ల మరణాలు తగ్గిపోయి జనాభా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
మెదక్ టేక్మాల్ దగ్ధం కేసులో ట్విస్ట్.. సినిమా కథను తలపిస్తున్న స్కెచ్ !
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
-
24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..షార్ లో ఏం జరుగుతోంది ? –
2 Comments