
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. నగరం మొత్తం గులాబీమయమైంది. అన్ని దార్లు ఖమ్మం వైపే అన్నట్టుగా గులాబీ జెండాలతో రెపరెపలాడుతోంది. వెంకటాపురంలో వంద ఎకరాల్లో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న సభను బీఆర్ఎస్ అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు జాతీయ నేతలను ఆహ్వానించారు. ఈ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మొత్తం వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు.
Read More : రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
ఈ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా హాజరవుతున్నారు. ముందుగా నలుగురు సీఎం లు, జాతీయ నేతలు హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్తారు. అక్కడి నుంచి రెండు ప్రత్యేక హెలీకాప్టర్ల లో ఖమ్మం కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే రెండో విడత కంటి వెలుగు కాక్యక్రమం ప్రారంభించి ఆరుగురికి కళ్ల జోళ్లు అందజేస్తారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ లో కేసీఆర్‌తో పాటు జాతీయ నేతలు మధ్యాహ్నాం భోజనం చేస్తారు.
More Read : సంక్రాంతి విజేత శృతిహాసన్.. ఎలాగో తెలుసా? –
అనంతరం కలెక్టరేట్ స్టేట్ ఛాంబర్ లో నలుగురు సీఎం లు, జాతీయ నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని సమాచారం. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీఆర్ఎస్ సభా వేదిక పైకి సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల సీఎంలు, అఖిలేష్ యాదవ్ చేరుకుంటారు. బీఆర్ఎస్ బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సభా వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ప్రకటిస్తారు కేసీఆర్. పార్టీ విధివిధానలపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. తెలంగాణలో జరిగిన అభివృద్ధి , సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. బారత రాష్ట్ర సమితి సభ ముగిసిన తర్వాత భారీ క్రాకర్ షో ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు.
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను.. ప్యాకేజి కోసం డ్యాన్స్ చేయను-అంబటి రాంబాబు –
4 Comments