
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్: ఇండియా వర్సెస్ కివీస్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఇవాళ జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 వేల 500 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. షీ టీమ్స్ తో ప్రత్యేకంగా నిఘా పెట్టారు. మ్యాచ్ సందర్భంగా ఇవాళ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. 12 గంటల నుండి స్టేడియం లోపలికి అనుమతి ఇస్తున్నారు.
Read More : మలక్‌పేట్ బాలింతల మృతికి ఇన్‌ఫెక్షనే కారణం.. ప్రభుత్వానికి అందిన ప్రాథమిక రిపోర్ట్ ! –
బ్లాక్ లో టికెట్స్ విక్రయిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు బ్లాక్ టికెట్లు అమ్ముతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. స్టేడియం గేట్ నెంబర్ 1, 12 దగ్గర మార్పులు చేశారు. ప్రతీ గేట్ దగ్గర CI ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ప్రేక్షకులు ఎక్కువ వస్తారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా రిజర్వ్ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. గేట్ నెంబర్ 1 నుంచి వీఐపీలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
-
పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం.. జగన్ ఆదేశిస్తే నేను రెడీ-అలీ –
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
5 Comments