
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: IAS అధికారి రాజశేఖర్, IRS అధికారి రామకృష్ణలకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించారని జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. విద్యాశాఖలో సర్వీస్ అంశాలకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు.. ఇద్దరు అధికారులకు నెల రోజు జైలు, రూ.2 వేలు జరిమానా విధించింది. వెంటనే అధికారులను అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read More : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్..2500 మంది పోలీసులతో భద్రత –
ఐఏఎస్ అధికారి రాజశేఖర్ గతంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణ ఇంటర్ బోర్డు కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో ఇద్దరు అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి …
-
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
-
వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ –
-
రిమోట్ ఓటింగ్ విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. రిమోట్ ఓటింగ్ అంటే ఏమిటి? –
-
పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం.. జగన్ ఆదేశిస్తే నేను రెడీ-అలీ –
-
జో బైడెన్ చుట్టూ బిగస్తున్న ఉచ్చు.. బయటపడుతున్న మరిన్ని రహస్య పత్రాలు –
One Comment