
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్: 2009 లో దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ నటించిన సినిమా బిల్లాను ప్రమోట్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోపై చేసిన వ్యాఖ్యలను ఇవాళ వెనక్కి తీసుకున్నారు. తాను ఆరోజు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయని.. తాను ఆరోజు అలా అనకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. తాను ఎవరినీ తక్కువ చేసి చూడాలనే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని చెప్పారు. ఇంతకీ ఎవరా హీరో?.. ఎంటా వ్యాఖ్యలు?
Read More : సంక్రాంతి విజేత శృతిహాసన్.. ఎలాగో తెలుసా? –
ప్రభాస్ ముందు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎందుకూ పనికిరాడంటూ రాజమౌళి అప్పట్లో ఒక ప్రకటన చేశాడు. ఈ పాత ప్రకటన వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యింది. ఇప్పుడు 80వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో పాల్గొన్న సందర్భంగా, రాజమౌళిని ఇదే విషయం గురించి ప్రశ్నించగా.. ఆయన తన తప్పును ఒప్పుకున్నాడు. రాజమౌళి తన పాత వీడియోపై స్పందిస్తూ, “ఇది చాలా కాలం, చాలా కాలం క్రితం .. అంటే దాదాపు 15-16 సంవత్సరాల క్రితం అనుకుంటాను.. నేను అలా అనకుండా ఉండాల్సింది.. . కానీ నేను దానిని అంగీకరించాలి. అతనిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు, నేను అతనిని చాలా గౌరవిస్తాను. ఇది చాలా కాలం క్రితం జరిగింది… ” అని తన తప్పును అంగీకరించారు.
More Read : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీకి ఆజ్యం పోస్తున్న వైసీపీ ఎమ్మెల్యే? –
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన రాజమౌళి 14 ఏళ్ల తర్వాత తన తప్పును ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయం. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా ప్రజాదారణ కలిగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. సమీప భవిష్యత్తులో హృతిక్ రోషన్ తో కలిసి పనిచేసే ఆలోచన కూడా రాజమౌళికి లేదు. అయినా అతను హృతిక్ రోషన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. 14 ఏళ్ల క్రితం తాను చేసిన తప్పును అంగీకరించడం రాజమౌళి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఆయనలోని ఈ స్వభాగం గొప్ప దర్శకుడిగానే కాకుండా గొప్ప మనిషిగా కూడా నిలబెట్టింది.
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ.. పార్టీలో చిచ్చు రాజేస్తున్న సన్నాహక సమావేశాలు ! –
One Comment