
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్: సంక్రాంతి పండగకు సినిమాలు రిలీజ్ అవ్వడం మామూలే. పండుగ వస్తుందంటే అంతకు మించి సినిమా ప్రియులకు పెద్ద పండగ వస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తెలుగు సినిమా పరిశ్రమలోని ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు వీరసింహారెడ్డి, రెండో రోజు వాల్తేరు వీరయ్య విడుదల అయ్యాయి. సహజంగానే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను పోల్చి చూసుకోవటం అలవాటు.
Read More : తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
అటువంటిది సంక్రాంతి సీజన్ లోనే రెండు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ పొంతనలు, పోలికలు మరింత ఎక్కువయ్యాయి. గురువారం రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ తనదైన తరహాలో విజృంభించారు. పూర్తి స్థాయిలో ఎనర్జీని కురిపిస్తూ వెండి తెరను హోరెత్తించారు. ఇటు శుక్రవారం రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి కూడా తన ఆకలిని తీర్చుకొన్నారు. పూర్తి మాస్ హీరో గా అభిమానులను ఉర్రూతలూగించారు. మరి ఈ ఇద్దరిలో సంక్రాంతి మొనగాడు ఎవరు అనేది చర్చనీయాంశమైంది.
More Read : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీకి ఆజ్యం పోస్తున్న వైసీపీ ఎమ్మెల్యే? –
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య .. రెండు సినిమాలకు మిశ్రమ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో బాక్సాఫీస్ యుద్ధంలో విజేత చిరంజీవి ?.. బాలకృష్ణ ? అంటూ పోటీ పడుతున్నారు. అయితే అసలు సంక్రాంతి విజేత మరెవరో కాదని శృతిహాసన్ అని ఒక ఫన్నీ టాక్ కూడా నడుస్తోంది. నిజానికి శృతిహాసన్ కి ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్ పెద్దగా ఏమీ లేదు. ఆమె వాల్తేర్ వీరయ్యతో పాటు వీరసింహారెడ్డిలో ఆమె రోల్ చాలా చిన్నది.
Read More : ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ.. పార్టీలో చిచ్చు రాజేస్తున్న సన్నాహక సమావేశాలు ! –
సీనియర్ హీరోల సరసన ఆమె డ్యాన్సులు చేయడానికి తప్ప ఆమె నటనను నిరూపించుకునే అవకాశమే దక్కలేదు. కాకపోతే వాల్తేరు వీరయ్యలో ఒక యాక్షన్ సన్నివేశంలో నటించే అవకాశం మాత్రం దక్కింది. అంతకు మించి శృతిహాసన్ చేసిందేమీలేదనే చెప్పాలి. అయితే సినిమాలో నటించడానికి సరైన అవకాశం లేకపోయినా పెద్దగా డేట్స్ ఖర్చుకాకపోయినా కూడా శృతిహాసన్ కు మొత్తం పారితోషికం అందింది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది నిజమైన సంక్రాంతి విజేత శృతిహాసన్
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
భూములు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరు ! –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
One Comment