
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: వైసీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. ద్వారంపూడి అవినీతిని జనసేనాని ప్రశ్నించడం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో ద్వారంపూడి ఎదురుదాడి చేశారు. దీనిపై స్పందించిన ద్వారంపూడి పవన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా దూషించడం మొదలుపెట్టారు.
Read More : క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
ఇప్పుడు కట్ చేస్తే, ద్వారంపూడి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను సంక్రాంతికి ఆతిథ్యమిచ్చాడు. వర్మ ద్వారంపూడి ఇంటికి వెళ్లి అక్కడ కాసేపు గడిపారు. ఇప్పటికే ఆర్జీవీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాగబాబు, వర్మ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. కొణిదెల బ్రదర్స్ ని ఉద్దేశించి వర్మ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తూ వైసీపీకి అనుకూలమైన ఖ్యాతిని పెంచుకున్నాడు వర్మ. పవన్, చంద్రబాబుపై బురదజల్లే సినిమాలు కూడా తీశాడు.
More Read : నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబాల సందడి.. భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ –
ఇప్పుడు పవన్‌పైనా, ఆయన కుటుంబంపైనా పరుష పదజాలం ఉపయోగించడం ప్రారంభించిన ద్వారంపూడి ఆర్జీవీని కలవడం.. పవన్‌పై మరో దిగజారి సినిమా తీయాలని వైసీపీ ఎమ్మెల్యే వర్మను ప్రోత్సహిస్తున్నాడన్న ఊహాగానాలకు దారితీసింది. ద్వారంపూడి పవన్‌పై చేసిన దూషణలపై కాకినాడలో కాపు ఓటర్లు ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్జీవీ పవన్‌ను కించపరిచే సినిమా తీయడానికి పూనుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇటు కాపు ఓటర్లు కానీ ఊరుకునే పరిస్థితి ఉండదు.
ఇవి కూడా చదవండి …
-
క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
-
నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
-
భూములు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరు ! –
-
గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –