
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రులపై సెటైర్లు వేశారు. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబును జోకర్ గా అభివర్ణించారు. ఆయన మంత్రి వర్గంలో జోకర్ అని.. సంబరాల రాంబాబు అని అన్నారు. జగన్ పాలనలో కష్టాలు అనుభవిస్తున్న ప్రజలని రంజింపచేయడానికే అంబటి రాంబాబుని మంత్రి వర్గంలో జోకర్ గా నియమించుకున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జనసేనాని వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే బోగి పండుగ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులేశారు. భోగి మంటల చుట్టూ గిరిజనులతో కలిసి డ్యాన్సులు చేశారు.
Read More : 14 ఏళ్ల తర్వాత తన తప్పును ఒప్పుకున్న రాజమౌళి !!! –
రోడ్డు మీద స్థానికులతో కలిసి ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వస్తావా జానకి పాటకు ఆయన చేసిన స్టెప్పులకు స్థానికులు ఆయనతో జత కలిశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో అంబటికి పవన్ కళ్యాణ్ పెట్టిన పేరు సరిగ్గా సరిపోతుందని నవ్వుకొన్నారు. అంబటి నిజంగా సంబరాల రాంబాబని సెటైర్లు వేశారు. ఇక మంత్రి అంబటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు. నువ్వు నీ తమ్ముడు అన్నట్లు నేను సంబరాల రాంబాబునే. కానీ నేను ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను అంటూ ట్వీట్ చేశారు.
More Read : సంక్రాంతి విజేత శృతిహాసన్.. ఎలాగో తెలుసా? –
పవన్ కళ్యాణ్ ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత టీడీపీతో పొత్తులు ఉంటాయని స్పష్టం చేయడంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడని.. ప్యాకేజి స్టార్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారని.. పవన్ రణస్థలం సభ వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. ఇలా ఆరోపణాస్త్రాలు సంధించారు.
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
తార్నాకలో నలుగురు మృతి కేసు..భార్య,తల్లి,కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య –
-
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ.. పార్టీలో చిచ్చు రాజేస్తున్న సన్నాహక సమావేశాలు ! –
2 Comments