
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్: సికింద్రాబాద్ తార్నాకలో నలుగురు ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. చెన్నైకి చెందిన ప్రతాప్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. భార్య సింధూర, నాలుగేళ్ల బాలిక ఆధ్యా, ప్రతాప్ తల్లి జయతిని ప్రతాప్ హత్య చేసినట్లు తేలింది. కరెంట్ వైరుతో గొంతు నులిమి ముగ్గురిని హత్య చేసిన ప్రతాప్… అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.
Read More : ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ.. పార్టీలో చిచ్చు రాజేస్తున్న సన్నాహక సమావేశాలు ! –
ప్రతాప్ చెన్నైలోని కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సింధూర హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం చెన్నైకు వెళ్లిపోదామని ప్రతాప్ భార్యతో చెప్పాడు. ఇదే విషయంపై ప్రతాప్, సింధూర మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. అయితే ఇందుకు సింధూర నిరాకరించడంతో వీరి మధ్య గత వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.
More Read : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీకి ఆజ్యం పోస్తున్న వైసీపీ ఎమ్మెల్యే? –
భార్య సింధూర, కుమార్తె ఆద్య, తల్లి జయతిని హత్య చేసిన ప్రతాప్.. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తార్కాకలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పండగపూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఫ్లాట్ లో నలుగురు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి …
-
క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
-
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
-
క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
-
భూములు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరు ! –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
One Comment