
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతోంది . ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వివేకా హత్య కేసు విచారణను ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.
Read More : క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
గంగిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు మెరిట్ ను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించి బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం వెల్లడించింది. గండిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసును ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు సరైన సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందని.. దర్యాప్తు సీబీఐ చేతికి వచ్చిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది.
More Read : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీకి ఆజ్యం పోస్తున్న వైసీపీ ఎమ్మెల్యే? –
వాటి ఆధారంగా గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలన్న తమ వినతిని హైకోర్టు తిరస్కరించిందని సీబీఐ తన పిటిషన్ లో వెల్లడించింది. అయితే విచారణకు గంగిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని ..బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన గంగిరెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తాజా పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. అనంతరం తీర్పును వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి …
-
క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
-
భూములు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరు ! –
-
గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
-
నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబాల సందడి.. భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ –
One Comment