
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్: ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ హై కమాండ్ ప్రణాళికలు రచిస్తుంది. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు చేపడుతున్న నియోజకవర్గ సన్నాహక సమావేశాలు పార్టీలో చిచ్చురాజేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానంపై తన ధిక్కార స్వరాన్ని వినిపించిన పొంగులేటి ప్రభావం సభపై పడకుండా ఉండేందుకు మంత్రుల బృందం ఇప్పటికే తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ నేతలు, ఆశావాహుల అడుగులు పార్టీ క్యాడర్ లో చీలికను తెస్తున్నాయి.
Read More : గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ.. వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం –
తాజాగా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశాన్ని నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగాకాంతారావ్ ఆదేశించినా ఎమ్మెల్యే వనమా వర్గం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆది నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవకు పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావ్ మధ్య ఉన్న గ్యాప్ కారణంగానే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సమావేశం అయ్యేందుకు వనమా విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే సన్నాహక సమావేశాన్ని తన ఇంట్లోనే నిర్వహించేందుకు ఎమ్మెల్యే వనమా ఏర్పాట్లు చేశారు. అయితే సమావేశానికి రేగా వర్గానికి చెందిన కొందరు నేతలతో పాటు వనమాతీరుపై అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
More Read : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీకి ఆజ్యం పోస్తున్న వైసీపీ ఎమ్మెల్యే? –
ఇదిలా ఉంటే గత కొద్దికాలంగా కొత్తగూడెం నియోజకవర్గంలో పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్ రావు సైతం తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 18న జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు గడల భారీగా జనసమీకరణకు యత్నిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇవాళ తన అనుచరగణంతో కొత్తగూడెం, పాల్వంచలో సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకుంటూ స్తబ్ధతగా ఉన్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ సైతం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు దూరంగా ఉంటారన్న ప్రచారంతో ఆయన క్యాడర్ సైలెంట్ గా ఉంటోంది.
Read More : క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… నకిలీ మద్యం విచారణలో నాంపల్లి ఎక్సైజ్ అధికారుల కొత్త స్టంట్లు…! –
ఏదేమైనా ఇన్నాళ్లూ స్తబ్ధతగా ఉన్న కొత్తగూడెం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆవిర్భావ సభకారణంగా బీఆర్ఎస్ క్యాడర్ ఎమ్మెల్యే వనమా, రేగా, జలగం, గడల వర్గాలుగా చీలిపోయింది. మరి పార్టీ క్యాడర్ లో వచ్చిన ఈచీలిక పార్టీకి మేలు చేస్తుందా?.. బీఆర్ఎస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న బీఆర్‌ఎస్ సభకు నష్టం చేయబోతుందా?… తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి …
-
క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
-
భూములు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరు ! –
-
గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
-
నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబాల సందడి.. భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ –
2 Comments