
-
అసలు వదిలి కొసరందుకున్న నాంపల్లి ఆబుకారు అధికారులు.!
-
నకిలీ యజమానితో డీలింగ్, మిగతా రెండు వైన్స్ లు క్లీన్ చిట్…!
-
ప్రజల ప్రాణాలు లెక్కలేనట్లుగా ఆఫీసర్ల వైకరి.
-
మునుగోడు బై ఎలెక్షన్ మొత్తం నకిలీ మధ్యమే…!
-
బయాందోళనలో మండల ప్రజలు, హెల్త్ డ్రైవ్ చేపట్టాలని డిమాండ్.
-
మొదటి నుండి ప్రజలు మొత్తుకున్నా పట్టని అధికారులు…!
-
టెండర్ పొందిన వ్యక్తులు కాకుండా అనధికార వ్యక్తికి పట్టం…
- వ్యభిచార గృహాలుగా మారిన నారాయణపురం, మర్రిగూడ మండలాలు…!
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది మన ఎక్సైజ్ అధికారుల పనితనమని మండల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. గత కొంత కాలం నుండి మర్రిగూడలో నకిలీ మద్యం అమ్ముతున్నారని ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్నా, నాంపల్లి ఎక్సైజ్ అధికారులు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా స్పందించలేదని అధికారులపై మండిపడుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పరిస్థితి వచ్చిన తరువాత కండ్లు తుడుచుకొని నిద్ర లేచిన అధికారులను చూసి పబ్లిక్ తిట్టుకుంటున్నారు. జిల్లాలోని మర్రిగూడ మండలానికి మూడు వైన్స్ లకు టెండర్లు ప్రభుత్వం ప్రకటించగా, వేరే వేరే ప్రాంతాల వ్యక్తులు ఈ టెండర్లను దక్కించుకున్నారు.
Read More : మలక్ పేట్ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి.. బాధిత బంధువుల ఆందోళనలతో ఉద్రిక్తత
ఇదిలా ఉండగా స్టానికంగా ఇంతకు ముందు టెండర్లు దక్కించుకున్న వేరే సామాజిక వర్గానికి చెందిన అనధికార వ్యక్తికి పగ్గాలు అప్పజెప్పారు నాంపల్లి ఎక్సైజ్ అధికారులు. ఇక మూడు వైన్స్ లను ఒకే దగ్గర పెట్టి, అధికారులు చెప్పిన విధంగా ఉంటూ, లక్షల్లో లాభాలు గడించాడని పబ్లిక్ టాక్.. ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న సదరు వ్యక్తి నకిలీ మద్యానికి తెర లేపాడని, ఏదైనా జరిగితే నాకేం సంభంధం అనే విధంగా ప్లాన్ చేశాడని వినికిడి….! ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఈ మూడు వైన్స్ షాపులకు వచ్చే, మద్యం ప్రియులకు బ్రాండ్ లో తేడాలు రావటం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు బయటపడటంతో వైన్స్ ల వద్ద కొంతమంది గొడవకు దిగిన సందర్బాలు ఉన్నాయని స్థానికుల అనుకుంటున్నారు.
ఇదంతా మొదటి నుండి ఇన్వెస్టిగేషన్ చేపట్టి పూస గుచ్చినట్లుగా వార్తలు ప్రచురించిన క్రైమ్ మిర్రర్ కధనాలకు అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఈ అంశంపై మర్రిగూడ మండల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి పిర్యాదు చేశారు. కమిషన్ అడిగిన విచారణ నివేదికను కూడా అధికారులు గోల్ మాల్ చేసి పంపారనే ఆరోపణలు గట్టిగానే వినపడుతున్నాయి. అప్పటి నుండి క్రైమ్ మిర్రర్ దిన పత్రిక యుద్ధ ప్రాతిపదికన, నకిలీ మధ్యం పుట్టుక, ప్రాంతాల గురించి వరుస కధనాలు ప్రచారం చేసింది. ఈ వరుస కధనాల దృశ్యా ఉన్నత అధికారుల నుండి చర్యలు మొదలై, తీగ లాగితే చివరికి డొంక కదిలింది. కానీ నాంపల్లి ఎక్సైజ్ అధికారులు మాత్రం, దృర్మార్గులను కాపాడే కంకణం కట్టుకొని వారికి దాపుగా నిలబడిందనే వార్తలు మండలంలో జోరందుకుంది.
Read More : ఢీ అంటే ఢీ…గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సిద్ధమవుతున్న బరులు
తమ్ముడు తన వాడైనా దర్మం ఒకటే అనే విదంగా ఆలోచలన చెయ్యాలవలసిన ఎక్సైజ్ అధికారులు, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అంతు చిక్కటం లేదని టాక్. ఈ మధ్య కాలంలో మర్రిగూడ వైన్స్ ల నందు పని చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసామని, మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి మండలాలలో బెల్ట్ షాపులను సీజ్ చేసామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. మర్రిగూడ మండలంలో కేవలం పద్మావతి వైన్స్ ని మాత్రమే సీజ్ చెయ్యటం, మిగతా రెండు వైన్స్ లను వదిలెయ్యటం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మూడు వైన్స్ లు సిండికేట్ గా మారి ఒకే వ్యక్తికి అప్పజెప్పినప్పుడు, కేవలం ఒకే వైన్స్ ని సీజ్ చెయ్యటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎక్సైజ్ అధికారులను క్రైమ్ మిర్రర్ వివరణ కోరగా, మెయింటనెన్స్ అనధికారికంగా నడుస్తున్నప్పటికి, ఏదైనా సమాచారం కావాలంటే టెండర్ పొందిన వ్యక్తుల ద్వారానే సమాచారం సేకరిస్తామని అన్నారు. అంటే ఒక ప్రభుత్వ అధికారే ఇవన్నీ తెలిసి కూడా వారికి మద్దతు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని ప్రజల అభిప్రాయం. ఇక ఎట్టకేలకు ఇష్టం ఉండి లేకనో కానీ నాంపల్లి, హాలియా, చౌటుప్పల్ ఎక్సైజ్ అధికారులు కలిసి మర్రిగూడలో పద్మావతి వైన్స్, గుర్రంపొడులో స్వాగత్ వైన్స్, నారాయణపురంలో ఒక వైన్స్ ని అధికారులు పది రోజుల క్రితమే గుట్టు చప్పుడు కాకుండా సీజ్ చేసారనే వార్తలు వినపడుతున్నాయి.
వైన్స్ షాపుల వ్యక్తికి అధికారుల అండతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల అండ కూడా తొడవటంతోనే ఈ దారుణాలకు తెగిస్తున్నారని అనుకుంటున్నారు. ఇక మునుగోడు బై ఎలక్షన్ లో మొత్తం నకిలీ మధ్యం సరఫరా అయినట్లు ఇప్పటికే ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. అధికారులు స్పందించి హెల్త్ డ్రైవ్ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మర్రిగూడలో మిగిలిన రెండు వైన్స్ లపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల అభిప్రాయం. ఇదిలా ఉండగా బెల్టు షాపుల ముసుగులో నారాయపురం, మర్రిగూడ మండలాల పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, ఈ వ్యభిచారాల ద్వారా యువత చెడిపోతుందని అధికారులు ఈ వ్యభిచారాలపై కూడా విచారణ చెయ్యాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇక అధికారుల చర్యలు ఏ మాత్రం ఉంటాయో చూడాల్సి ఉంది.
ఎక్సైజ్ సిఐ వివరణ: మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి మండలంలోని అయిదు బెల్టు షాపులలో నకిలీ మధ్యం స్వాధీన పరుచుకొని, కేసులు నమోదు చేసామని, ఉన్నత అధికారుల ఆర్డర్స్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
మరింత సమాచారంతో మరో ప్రత్యేక కధనం ద్వారా మీ ముందుకు… నిఘా వ్యవస్థ నిద్రిస్తే.. క్రైమ్ మిర్రర్ కాపుగాస్తుంది..
ఇవి కూడా చదవండి …
సూపర్ సార్