
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్: భూములు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరైంది. సస్పెండ్ అయిన ఆర్ఐ రాజేష్ తో కలిసి మోసానికి పాల్పడ్డ అంబర్ పేట్ సీఐ సుధాకర్ ని వనస్థలిపురం పోలీస్ లు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. మాజీ ఆర్ ఐ రాజేష్ పరారీలో ఉన్నాడు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం సీఐ సుధాకర్ ని హయత్ నగర్ లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇద్దరు షూరిటీలు, చెరో రూ.15వేల డిపాజిట్ పూచీకత్తుతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
Read More : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు..ఘనంగా భోగభాగ్యాల భోగి పండుగ –
హైదరాభాద్ లో పనిచేస్తూ సస్పెండ్ అయిన ఆర్ ఐ రాజేష్ , అంబర్ పేట్ సీఐ సుధాకర్ పై 15 రోజుల క్రితం బి ఎన్ రెడ్డి నగర్ కి చెందిన విజయత్ అనే వ్యక్తి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కందుకూరు లిమిట్స్ లోని నేదునూరు గ్రామంలో సర్వేనెంబర్ 54/2 లో ఉన్న పది ఎకరాల ల్యాండ్ ని ఇప్పిస్తానని చెప్పి బి ఎన్ రెడ్డి ఎస్ కే డి నగర్ కు చెందిన తన వద్ద నుండి 54.5 లక్షల రూపాయలు రాజేష్ తీసుకున్నాడుని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితుడు వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.
More Read : నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
అయితే పలు ఆరోపణలతో సస్పెండ్ అయిన ఆర్ ఐ తాను ఎమ్మార్వో అంటూ నకిలీ ఐడీ కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్స్ ద్వారా ఆర్డిఓ అవుతానని నమ్మబలికి మోసాలకి పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే బాధితుల నుండి తీసుకున్న రూ. 54.5 లక్షల్లో రూ. 40 లక్షలు సీఐ సుధాకర్ అకౌంట్ కు రాజేష్ బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా బాధితుడు విజయంత్ తో కూడా సీఐ సుధాకర్ పలు మార్లు మాట్లాడినట్లు పిర్యాదులో పేర్కొన్నారు.
Read More : క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
కాగా బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్ ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు గుర్తించారు. అయితే ఇదే ల్యాండ్ అమ్ముతామంటు తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయటంతో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి విచారణ చేపట్టారు. ఏసీసీ విచారణలో ఇదంతా నిజమేనని తేలడంతో సీఐ సుధాకర్ ని శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఇవి కూడా చదవండి …
-
గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
-
తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి.. ఉత్తర్వులు జారీ –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
-
ఢీ అంటే ఢీ…గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సిద్ధమైన బరులు –
-
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలనం.. కాంగ్రెస్ ఉంటారా.. ఉండరా? –
One Comment