
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు సంక్రాంతి పండుగకు వచ్చి సందడి చేశారు. చంద్రబాబు ఇంటి ముందు భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ముచ్చటించారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. పండగ పూట టీడీపీ నేతలను జైల్లో పెట్టారని.. భవిష్యత్తులో ఎక్కడ ఉంటావో ఊహించుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Read More : భూములు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో సీఐ సుధాకర్ కి బెయిల్ మంజూరు ! –
పుంగనూరులో ఎలా గెలుస్తాడో చూస్తానని అన్నారు. మిగిలిన మంత్రులకూ చంద్రబాబు హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో ఎక్కడికి పారిపోయినా తీసుకొస్తానని .. అందరి లెక్కలను వడ్డీతో సహా చెల్లిస్తానని అన్నారు. ఇంతవరకు నా సున్నితత్వం చూశారు.. ఇకపై కఠినాన్ని చూస్తారని చంద్రబాబు ప్రకటించారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని విధులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు తెలిపారు. పుంగనూరు కాదు 175 నియోజకవర్గాలు గెలవాలని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
More Read : నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి తాను కృషి చేస్తే… ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయిందన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన మొదలుపెట్టారు. ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కందుకూరులో ప్రభుత్వం కుట్రచేసి తొక్కిసలాటకు కారణమైందన్న చంద్రబాబు..గుంటూరు తొక్కిసలాటలోనూ కుట్ర ఉందని.. త్వరలో బయటపడుతుందని అన్నారు.
Read More : క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
నారావారి పల్లెలో హిందూపురం ఎమ్మేల్యే బాలకృష్ణ సందడి…… నారావారిపల్లెలో బాలకృష్ణ సందడి చేశారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వేసిన భోగి మంటలలో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగ్గదని.. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని ఆయన అన్నారు. ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి …
-
గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
-
తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి.. ఉత్తర్వులు జారీ –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
-
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు..ఘనంగా భోగభాగ్యాల భోగి పండుగ –
-
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలనం.. కాంగ్రెస్ ఉంటారా.. ఉండరా? –
2 Comments