
క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఆంధ్ర డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి శోభతో కళకళలాడుతోంది. భోగభాగ్యాల భోగితో సంక్రాంతి పండుగకు ఘనంగా స్వాగతం పలికారు తెలుగు ప్రజలు. హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టిన జనం ..బంధువులు, స్నేహితులతో పండుగ నాలుగు రోజులు ఆనందంగా గడుపుతున్నారు. తెలుగు సంస్కృతి , సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరుపుకుంటున్నారు.
Read More : క్రికెట్ మ్యాచ్ ఉన్నా..కోడిపందాలు ఉన్నా కేసీఆర్ సభకు రావాల్సిందే-హరీష్ రావు –
తెల్లవారుజాము నుంచే భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్దలు, చిన్నారులు భోగి మంటలు చుట్టూ చేరి డ్యాన్సులు చేశారు.తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో భోగి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. పార్క్ లో భోగి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేశారు. ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.విజయవాడలో బోగి సంబరాలు అంబరాన్నంటాయి.
More Read : నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
తెల్లవారుజామునుంచే బోగీ మంటలు వేసి స్టెప్పులేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మేల్యే మల్లాది విష్ణు బోగీ వేడుకల్లో పాల్గొంటున్నారు. హరి దాసులు సంకీర్తనలు, సన్నాయి మేళాలు, గంగి రెద్దుల కోలాహలం నడుమ పెద్ద ఎత్తున బోగీ వేడుకలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీ, బహిరంగ సభలు నిషేధిస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ని జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్నం చేశారు
Read More : ఢీ అంటే ఢీ…గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సిద్ధమైన బరులు –
చింతమనేని ప్రభాకర్. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వన్ సెంటర్‌లో భోగిమంటలు వేసి సంక్రాంతి వేడుకల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. సంస్కృతిని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి చీకటి చట్టాలను రద్దు చేయాలని.. భోగిమంటల్లో జీఓ నెంబర్ వన్ ప్రతులను వేసి దగ్ధం చేశారు. ఇదే ఖర్మ… మన రాష్ట్రానికి… సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. అంటూ నినాదాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తన సొంతూరులో భోగి మంటలు వేసి సందడి చేశారు
More Read : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలనం.. కాంగ్రెస్ ఉంటారా.. ఉండరా? –
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో స్థానికులతో కలిసి భోగిమంటలు వెలిగించారు. అనంతరం కాలనీవాసులతో కలిసి సంక్రాంతి పాటలకు స్టెప్పులేశారు. బంధువులు, గ్రామస్థులతో కోలాటమాడుతూ మంత్రి ఎర్రబెల్లి సందడి చేశారు. ప్రజలంతా భోగభాగ్యాలతో వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
One Comment