
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్: హైదరాబాద్ మలక్ పేట్ ప్రభుత్వ ఏరియా హాస్పటల్ దగ్గర శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏరియా హాస్పటలో డెలివరీ కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు సిరివెన్నెల, శివాని చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యంగానే తమ వాళ్లు పిల్లలకు దూరమయ్యారని ఇద్దరు కుటుంబ సభ్యులు హాస్పటల్ ముందు ఆందోళన చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతు తెలుపుతూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ మద్దతు ప్రకటించారు.
Read More : ఢీ అంటే ఢీ…గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సిద్ధమవుతున్న బరులు –
ఇక జరిగిన ఘటన మీద హెల్త్ కమీషనర్ , ఆర్డీఓ అధికారులు స్పందించారు. మలక్ పేట్ ఏరియా హాస్పటలో జరిగిన ఘటనల మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామని , వైద్యుల తప్పు అని తేలితే యాక్షన్ తీసుకుంటామని హెల్త్ కమీషనర్ అన్నారు. బుధవారం మొత్తం 11 ఆపరేషన్లు జరిగాయని ఇద్దరు మాత్రం చనిపోయారని , మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎగ్స్ గ్రేషియా ఇస్తామని ఆర్డీఓ అన్నారు . భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అధికారులు తెలిపారు.
More Read : నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
ఇక చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల నష్ట పరిహారం సరిపోదని 50 లక్షల పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన శివాని అనే గర్భిణిని ఆమె కుటుంబసభ్యలు మలక్ పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్లర్లు ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు డెంగ్యూ, బీపీ ఉందని గాంధీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
Read More : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలనం.. కాంగ్రెస్ ఉంటారా.. ఉండరా? –
డెంగ్యూ, బీపీ ఉన్న గర్భిణులకు సర్జరీలు చేయకూడదని వైద్యులు అన్నారు. డెంగ్యూ వ్యాధిని కంట్రోల్ పెట్టిన తర్వాత సర్జరీ చేయాలని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. క్రిటికల్ గా ఉన్న శివానికి వైద్యులు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. అయినా సరే ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ శివాని చనిపోయింది. మలక్ పేట్ ఆస్పత్రికి వచ్చిన మరో బాలింత కూడా మరణించింది. నాగర్ కర్నూలు జిల్లా నెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఆమె కుటుంబసభ్యులు ప్రసవం కోసం మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
More Read : పదవ తరగతి విద్యార్థులు బీఆలర్ట్.. పరీక్షల విధానం మారిపోయింది.. –
అయితే ఆమెకు డెంగ్యూ ఉన్నా.. వైద్యులు గుర్తించలేదు. అలాగే ఆమెకు డెలివరీ చేశారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో హుటా హుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఒకే రోజు ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళలు చనిపోయారని ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. డాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు కోరారు.
2 Comments