
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కోడి పందాలు భారీగా నిర్వహించేందుకు రాజకీయ నేతలు, నిర్వాహకులు సై అంటున్నారు. కోట్లలో పందాలు నిర్వహించాలని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదుల ఎకరాల్లో పొలాలు చదును చేసి బరులు ఏర్పాటు చేస్తున్నారు.మరోవైపున పోలీసులు మాత్రం కోడి పందాలకు అనుమతిలేదని చెబుతున్నారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠినంగా శిక్షిస్తామంటున్నారు.
Read More : పదవ తరగతి విద్యార్థులు బీఆలర్ట్.. పరీక్షల విధానం మారిపోయింది.. –
పలువురిపై కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ గోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వాహకులు మాత్రం తమ పనిలో తాము తలమునకలై ఉన్నారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సాంప్రదాయ క్రీడ పేరుతో కోడి పందాలు నిర్వహించేందుకు కాకినాడ జిల్లాలో బరులు సిద్ధమవుతున్నాయి. కోట్లాది రూపాయల జూదాలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కోడి పందాల బరుల వద్ద భారీ ఎత్తున షామియాలు వేస్తున్నారు.
More Read : నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
విశాలమైన ప్రదేశాలను చదును చేస్తూ భారీగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలు ఆడేందుకు, చూసేందుకు వచ్చే వందలాది మంది కోసం కూలీలను పెట్టి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు.కాకినాడ జిల్లాలో తిమ్మాపురం, అచ్చంపేట, వలసపాలక, వాకలపూడి, తాళ్ళరేవు మండలం పటవల, నీలపల్లి, సుంకటరేవు తదితర చోట్ల కోడి పందాల కోసం బరులు వారం రోజులుగా సిద్ధం అవుతున్నాయి. స్థానిక రాజకీయ నేతల అండదండలతో పోలీసుల లోపాయికారి అనుమతులతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
Read More : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలనం.. కాంగ్రెస్ ఉంటారా.. ఉండరా? –
ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్దలు వచ్చి ఇక్కడ కోడి పందాలు నిర్వహించేందుకు స్థలాలు లీజుకు తీసుకుని మరీ జూద క్రీడలు యధేచ్ఛగా నిర్వహించాలని ఏర్పాట్లు చకచకా చేసుకుపోతున్నారు. సంక్రాంతిని సాంప్రదాయ బద్ధంగా నిర్వహించాలని, ఎలాంటి జూదాలకు ఆస్కారం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రచారం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కాకినాడ జిల్లాలో కోడి పందాల నిర్వహించేందుకు అనేక ప్రాంతాల్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు
ఇవి కూడా చదవండి …
-
గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
-
తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి.. ఉత్తర్వులు జారీ –
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
-
జిలేబీ బాబాగా అవతారం.. మహిళలపై ఆకృత్యాలు.. వీడియోలు తీసి బెదిరించి.. –
One Comment