
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు కరీంనగర్ లో సింహ గర్జన సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందని.. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి రాష్ట్ర సాధనకు కారణమైందని.. అలాంటి సభే ఖమ్మం జిల్లాలోను జరగబోతోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత దేశ రాజకీయాలకు మలుపు తిప్పే సభ ఖమ్మం జిల్లాలో జరగబోతుందన్నారు.
Read More : మలక్ పేట్ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి.. బాధిత బంధువుల ఆందోళనలతో ఉద్రిక్తత –
ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న బీఆర్ఎస్ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ , పంజాబ్ ముఖ్యమంత్రులు పాల్గొంటారని హరీష్ రావు చెప్పారు. దేశానికి దిశా దశలు మన ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న రోడ్లు,వసతులు,కరెంటు,రైతు పథకాలు మన పక్క రాష్ట్రం ఏపీలో ఉన్నాయా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తుందని మంత్రి ఆరోపించారు. రైతు బంధు పేరుతో రైతు అవసరాలు తీర్చిన మహా నాయకుడు మన కేసీఆర్ అని చెప్పారు.
More Read : నిన్న మద్యం.. నేడు పాలు… కల్తీ దందాకు అడ్డాగా నల్గొండ జిల్లా –
ఇంకా హరీష్ రావు మాట్లాడుతూ… ‘రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం కిసాన్ సమ్మాన్ యోచన పేరుతో అమలు చేస్తుంది. రైతు చనిపోతే గతంలో ఒక్క రూపాయి ఇచ్చిన ప్రభుత్వాలు లేవు , కానీ తెలంగాణ వచ్చాక ఐదు లక్షల రూపాయల రైతు బీమా అందిస్తున్నారు. ఎన్నికల హామీ కాకపోయినా మిషన్ భగీరథను మూడేళ్లలో చెప్పి మరీ అమలు చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఇంటింటి కీ నీళ్లు ఇవ్వకపోతే ఓటు అడగనని చెప్పిన మహానాయకుడు మన కేసీఆర్.
Read More : మలక్ పేట్ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి.. బాధిత బంధువుల ఆందోళనలతో ఉద్రిక్తత –
మన మిషన్ భగీరథను కాపీ కొట్టిన కేంద్రం హర్ ఘర్ కో జల్ పేరుతో పథకాన్ని అమలు చేస్తుంది. మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తుంది. జిల్లా జిల్లాకు మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఏర్పాటు చేసింది.యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోంది. కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు.. తెలంగాణ తరహాలో పథకాలు ఇవ్వాలని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు.మహారాష్ట్రలో అనేకమంది సర్పంచులు తెలంగాణ పథకాలు కావాలని లేదంటే తెలంగాణలో తమను కలపాలని తీర్మానాలు చేస్తున్నారు.
More Read : పదవ తరగతి విద్యార్థులు బీఆలర్ట్.. పరీక్షల విధానం మారిపోయింది.. –
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. నలుగురు ముఖ్యమంత్రులతో గొప్ప సభ జరిపే అదృష్టం మన ఖమ్మం జిల్లాకు దక్కింది. మన పార్టీ సత్తా, మన ముఖ్యమంత్రి సత్తాను ఈ దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. సత్తుపల్లి నుంచి 50 వేల మందిని తరలిస్తానని ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్ ఉన్న ,కోడిపందాలు ఉన్న జనమంతా కేసీఆర్ సభకు తరలిరావాలి. మన రాష్ట్రంలో నాట్లు పడాలంటే చత్తీస్గడ్ , బీహార్ మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. 18 తేదీన తర్వాతనే అసలైన పండుగ చేసుకుందాం . ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని సమకూర్చుకొని నాయకులు కార్యకర్తలు ప్రజలు సభకు తరలి రావాలి.
Read More : ఢీ అంటే ఢీ…గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సిద్ధమవుతున్న బరులు –
నాయకులు కూడా ప్రజలతో పాటు తరలిరావాలి. ప్రజలను తిరిగి ఇంటిదాకా తీసుకురావాలి. సిపిఐ , సిపిఎం నాయకులు కూడా నన్ను కలిశారు. ఏ గ్రామంలో అయినా సరే సిపిఐ, సిపిఎం నాయకులు సభకు వస్తానంటే తీసుకొని రావాలి. తుమ్మల రేపటి నుంచి ఖమ్మంలోనే మకాం వేస్తారు. వారి సీనియారిటీ , అనుభవం మాకు కావాలి. జిల్లా అంతా దశ దిశ తుమ్మల గారి నేతృత్వంలోనే జరుగుతుంది . దేశ రాజకీయాలను మలుపు తిప్పే చారిత్రాత్మక సభ ఇది.
More Read : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలనం.. కాంగ్రెస్ ఉంటారా.. ఉండరా? –
కరీంనగర్ సభ తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చినట్టు ఖమ్మం సభ టిఆర్ఎస్ పార్టీకి జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకొచ్చే సభ. మేము అడిగినా కేసీఆర్ మాత్రం సభ నిర్వహించే అదృష్టాన్ని ఖమ్మం ప్రజలకు కల్పించారు. సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు పిలిచినా నేను ముందుంటా ‘… అని హరీష్ రావు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే వెంకట వీరయ్య పాల్గొన్నారు.
One Comment