
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: గుండెపోటుతో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో అర్ధంకాని పరిస్థితి. ఇటీవల కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేదు.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, ఫిట్ గా ఉన్నవారు సైతం గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు.వృద్ధుల కంటే 50 ఏళ్ల లోపు ఉన్నవారిలోనే మరణాలు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
Read More : గ్రాండ్ గా బీఆర్ఎస్ నేత మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు –
తాజాగా భారత సంతతికి చెందిన వ్యక్తి మస్కట్ లో కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. నలుగురు స్నేహితులు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుతూ కనిపిస్తున్నారు. ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. అయితే ఉన్నట్లుండి హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. అందులో ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ కోర్టులోనే కుప్పకూలిపోయాడు.
More Read : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి.. ఉత్తర్వులు జారీ –
ఏం జరిగిందో అర్ధంకాని స్నేహితులు కంగారుపడుతూ అతడి దగ్గరికి వచ్చారు. పడిపోయిన వ్యక్తిని లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడు లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అతను అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. నిమిషం నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మృతుడి వయసు 38 ఏళ్లు.. అతను కేరళకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన జనవరి 2న జరిగినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి …
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
-
మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతం? –
-
గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. ఓపిక లేకపోయినా.. –
-
జిలేబీ బాబాగా అవతారం.. మహిళలపై ఆకృత్యాలు.. వీడియోలు తీసి బెదిరించి.. –