
కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు దేవరింటి మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వివేకానంద జయంతి రోజునే మస్తాన్ రెడ్డి జన్మదినం కావడంతో.. ఆయన అనుచరులు, అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అర్దరాత్రి 12 గంటలకు వివేకానంద నగర్ లోని అతని నివాసంలో వేడుకలు జరిపారు. మస్తాన్ రెడ్డితో కేక్ కట్ చేయించి సన్మానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు యువ నాయకుడు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చారు మస్తాన్ రెడ్డి అనుచరులు. తనకు విషెష్ చెప్పడానికి వచ్చిన అనుచరులు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు మస్తాన్ రెడ్డి.
One Comment