
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా చెప్పుకునే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూనే. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేస్తుంటారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొంతకాలంగా కాంగ్రెస్ తో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్త బుట్టలో పడ్డాయన్నారు. పీసీసీ కమిటీలను పెద్దగా పట్టించుకోనని.. నాలుగైదు సార్లు ఓడిపోయిన వాళ్లతో నేను కలిసి కూర్చోవాలా అంటూ కామెంట్ చేశారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్లనే అడగాలి. తాను నియోజకవర్గ పర్యటన వల్ల ఠాక్రేను కలవలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు కోమటిరెడ్డి. తమకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని ఈ భేటీలో కోమటిరెడ్డి ఠాక్రేకు వివరించారు. అయితే దీనిపై ఠాక్రే కోమటిరెడ్డికి హామి ఇట్టినట్టు తెలుస్తుంది. మీ అవసరం ఉంది. అందుకే ప్రజల్లో తిరగండి. హైకమాండ్ అన్ని చూసుకుంటుంది. ఇకపై ఇలాంటివేవీ జరగవని ఠాక్రే కోమటిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి హోదాలో తొలిసారి మాణిక్ రావు హైదరాబాద్ కు నిన్న వచ్చారు. అయితే వచ్చి రాగానే మాణిక్ కోమటిరెడ్డికి ఫోన్ చేశారు. గాంధీభవన్ కు రావాలని ఫోన్ లో కోమటిరెడ్డికి చెప్పగా..గాంధీభవన్ కు రానని బయటే కలుస్తానని ఆయన చెప్పడంతో మాణిక్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భేటీ అవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసినా కూడా గాంధిభవన్ కు రాకపోవడంపై కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో నేను నియోజకవర్గ పర్యటనలో ఉన్నాను. అందుకే గాంధీభవన్ కు రాలేకపోయాను. ఈ విషయాన్ని మాణిక్ రావు ఠాక్రేకు చెప్పానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తనతో పాటు మరికొందరు నేతలైన సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి వంటి నాయకులు కూడా గాంధీభవన్ కు వెళ్లలేదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
2 Comments