
క్రైమ్ మిర్రర్,తెలంగాణ డెస్క్: మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్ సరిహద్దుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ , సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. అయితే హిడ్మా మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇప్పటిదాకా ధృవీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ ప్రచారం జరిగింది.
Read More : గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు –
43 ఏళ్ల వయసున్న హిడ్మా సన్నగా ఉంటాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా ఆదివాసీ తెగకు చెందినవాడు. 17ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరాడు. మడావి హిడ్మాకు హిద్మల్లు, సంతోష్ అనే పేర్లు కూడా ఉన్నాయి. దశాబ్దకాలంగా హిడ్మా అత్యధిక మంది పోలీసులను హతమార్చి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అందుకే ఆయనపై 45 లక్షల రివార్డు ఉంది. హిడ్మా ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. మావోయిస్టు సాయుధ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లాలో కీలక నేతగా ఎదిగాడు.
More Read : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి.. ఉత్తర్వులు జారీ –
హిడ్మా వ్యూహాలు చాలామటుకు సక్సెస్ కావడంతో హిట్ లిస్ట్ లో ఉన్నాడు. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేసి చాలా మంది ప్రాణాలను తీయడంతో హిట్ లిస్ట్ లో ఉన్నాడు. హిడ్మా రచించిన వ్యూహాల్లో ఉర్పల్ మెట్లలో 2007లో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనలో హిడ్మానే కీలక సూత్రధారి. హిడ్మాకి మావోయిస్టు పార్టీలో మూడు ప్రధాన విభాగాలయిన పార్టీ, సాయుధ బలగం, ప్రజా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవముంది.
ఇవి కూడా చదవండి …