
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట కొనసాగుతోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా అమెరికాలోనూ అద్దరగొట్టింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ ఆర్ ఆర్ మెరిసింది. బెస్ట్ ఒరిజినల్ కేటిగిరీలో అవార్డు అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి ఏసియా, భారత్ సినిమాగా రికార్డు సృష్టించింది.
Read More : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి.. ఉత్తర్వులు జారీ –
లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డు ఫంక్షన్ లో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కు అవార్డు ప్రకటించారు. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలకు చిత్ర యూనిట్ ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు.అవార్డు రావడం పట్ల కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పారు. తన సోదరుడికి అవార్డు రావాలని కోరుకున్నారు. పాట రాసిన చంద్రబోస్, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కు శుభాకాంక్షలు తెలిపారు.
More Read : గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. ఓపిక లేకపోయినా.. –
ఇక అవార్డు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రదాని మోదీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేశ్, వెంకయ్యనాయుడు, షారుక్ ఖాన్, ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారు గర్వించదగ్గ క్షణమని చిరంజీవి ట్వీట్ చేశారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అన్నారు. ఇటీవలె జపాన్ లో ఆర్ఆర్ ఆర్ సినిమా సత్తా చాటింది.
Read More : జిలేబీ బాబాగా అవతారం.. మహిళలపై ఆకృత్యాలు.. వీడియోలు తీసి బెదిరించి.. –
ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు అమెరికాలో కూడా హవా కొనసాగించడం పట్ల భారతదేశం గర్వపడుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందటే ఆస్కార్ కు చేరువలో ఉన్నట్టేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇలానే ఆర్ఆర్ఆర్ తన హవా కొనసాగిస్తూ ఆస్కార్ అవార్డు కూడా సాధిస్తుందేమో చూడాలి. ఆల్ ద బెస్ట్ టు ఆర్ఆర్ఆర్ టీమ్.
ఇవి కూడా చదవండి …
3 Comments