
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: మంత్ర తంత్రాలు వచ్చని నమ్మించాడు. తాంత్రిక విద్యలు తెలుసునంటూ మాయ చేశాడు. మహిళలకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. వాటిని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ నకిలీ బాబా మోసం వెలుగులోకి వచ్చింది. జిలేబీ బాబాగా పేరుపొందిన ఈ బాబా పేరు అమర్ పురి అలియాస్ అమర్ వీర్. సొంతూరు పంజాబ్ లోని మాన్సా ప్రాంతం.
Read More : హిందీలో వరుస ఫ్లాప్ లు.. తెలుగులో ఫుల్ డిమాండ్ ! –
20 ఏళ్ల కిందట కుటుంబంతో కలిసి హర్యానాలోని తొహానాకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడే రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం నడిపించేవాడు. అయితే కొన్నాళ్లకు భార్య మరణించడంతో అమర్ వీర్ కనిపించకుండా పోయాడు. సడెన్ గా మళ్లీ తిరిగొచ్చి తనకు తాంత్రిక విద్యలు వచ్చునంటూ కొత్త అవతారమెత్తాడు. సమస్యలేమైనా సరే ఇట్టే తొలగించేస్తానంటూ జిలేబీ బాబా అవతారమెత్తాడు. జనాలను తన బుట్టలో సులభంగా వేసుకున్నాడు. బాలక్ నాథ్ గుడిలో పూజారిగా కూడా పనిచేయడం మొదలుపెట్టాడు.
More Read : గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. ఓపిక లేకపోయినా.. –
ఈ క్రమంలో మహిళలను లొంగదీసుకున్నాడు అమర్ వీర్. తాంత్రిక పూజలు చేసేటప్పుడు వారిని ఆత్మలు ఆవహిస్తాయని నమ్మించి.. వారికి మత్తు మందు ఇచ్చేవాడు. తర్వాత వారిపై ఆకృత్యాలకు పాల్పడేవాడు.అంతటితో ఆగని అమర్ దీప్ తన ఆగడాలను వీడియో కూడా తీసేవాడు. ఆ వీడియోలను బాధితులకు చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. వాళ్లను బెదిరించి డబ్బులు గుంజేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు.
Read More : కేసీఆర్ కు డబుల్ షాక్.. కీలక నేతలు జంప్! –
ఇలా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కొంత మంది బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. జిలేబీ బాబా ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా 120కి పైగా వీడియోలు, మత్తు పదార్థాలు దొరికాయి. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారించిన హర్యానా కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
ఇవి కూడా చదవండి …
4 Comments