
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం కలిసివచ్చే అన్ని అస్త్రాలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలన్నీ తెలిసిన ఈటెల రాజేందర్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగడతాడని కేంద్ర బీజేపీ పెద్దలు యోచిస్తున్నారని సమాచారం. కేసీఆర్, కేటీఆర్ కు ధీటైన సమాధానం చెప్పాలంటే తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెలకు అప్పగించడం తప్పదని తెలుస్తోంది.
Read More : చేర్యాల జెడ్పీటీసీపై గొడ్డళ్లు, కత్తులతో దాడి.. ఆస్పత్రిలో మల్లేశం మృతి..విచారణకు ఆదేశం
తెలంగాణలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. వారిని పార్టీ వైపు మళ్లించేందుకు ఈటెల రాజేందర్ కు పెద్దపీట వేయనున్నారు. తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం భారీగా ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కు బీజేపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని పెద్దల వ్యూహంగా ఉంది. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఈటెల సొంతం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా ఓ వెలుగు వెలిగారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఆయన ఆర్థిక శాఖా మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తరవాత కేసీఆర్ తో ఈటెలకు చెడింది. దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు సవాల్ విసిరి మరీ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
Read More : పిట్టల్లా రాలుతున్న మునుగోడు జనాలు.. ఆగస్టు నుంచి అమ్మింది నకిలీ మద్యమే!
బండి సంజయ్ బీఆర్ఎస్ ను ఎదుర్కోవడంతో వెనుకబడిపోతున్నాడు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమికి కూడా బండి సంజయ్ చేతగాని తనంగా కేంద్రం భావిస్తోంది. కనీసం కేంద్రం నుంచి డబ్బు పంపినా మునుగోడులో ఓటర్లకు పంచలేకపోయారని కేంద్ర నాయకత్వం గుర్రుగా ఉందట. మునుగోడులో బీజేపీ గెలిచి ఉంటే కేసీఆర్ కు చెక్ పెట్టడానికి అవకాశం దొరికేది. కానీ అలా జరగలేదు. దీంతో బండి సంజయ్ ను పక్కన బెట్టి బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటెల రాజేందర్ కు అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి …
scpoNCDmRuISLPb