
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: చైనాలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇలాగే కొనసాగితే రాను రాను కోట్లలో నమోదయ్యే పరిస్థితి ఎంతో దగ్గర్లో ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచదేశాలు తమ పట్ల వివక్ష చూపుతున్నాయని చైనా ఆరోపించింది.చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు వైరస్ నిర్థారణ పరీక్షలు, నెగెటివ్ ధ్రువపత్రాలు తప్పనిసరి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
Read More: ఫుట్‌బాల్ మాంత్రికుడు ఇకలేరు – తుదిశ్వాస విడిచిన పీలే –
ఈ నేపథ్యంలో ఈ నిబంధనలను చైనా తప్పు పడుతోంది. ఇవన్నీ వివక్షాపూరిత ఆంక్షలని డ్రాగన్ చైనా ఘాటు ఆరోపణలు చేసింది. కోవిడ్ కట్టడికి మూడేళ్లుగా తాము చేస్తున్న ప్రయత్నాలను విధ్వంసం చేయడమే ప్రపంచ దేశాలు పెట్టిన నిబంధనల ఆంతర్యమని చైనా ఆరోపించింది.ఇదిలా ఉండగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో విదేశాలకు వెళ్లడానికి ఎంతోమంది చైనా వాసులు ఆసక్తి చూపుతున్నారు. ఏమైనా చైనాలో కరోనా ఉధ్రుతిని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.
More Read: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌ను…..???? –
ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణీకుల నుంచి వైరస్ వ్యాపించకుండా భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి.ఇటలీ, దక్షిణ కొరియా, అమెరికా, ఇటలీ, జపాన్, తైవాన్ సహా భారత్ కూడా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఇటీవలె ఆంక్షలు విధించింది. చైనా నుంచి వచ్చే వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని నిబంధన విధించింది.ఇలా చర్యలు చేపట్టడాన్ని చైనా తప్పు పడుతోంది.
ఇవి కూడా చదవండి …
-
ప్రధాని మోదీ తల్లి… 100 ఏళ్ల వయసున్న హీరాబెన్ కన్నుమూత –
-
దూరంగా ఉన్నా ఓటు వేయొచ్చు.. రిమోట్ ఓటింగ్ కు ఎన్నికల సంఘం కసరత్తు ! –
-
రోడ్డు ప్రమాదంలో స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు తీవ్ర గాయాలు – మంటల్లో దగ్ధమైన అతడి కారు –
-
కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి.. ఇది యాక్సిడెంట్ కాదు వికృత విన్యాస నరబలి-సజ్జల –
-
రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? అచ్చు అలానే ఉండాలట –
One Comment