
క్రైమ్ మిర్రర్ ఆన్లైన్ డెస్క్ :
విశాఖ జిల్లాలో జనసేన నాయకుడి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పార్టీ తూర్పు నియోజకవర్గానికి చెందిన రాఘవరావు తన మనవరాలి వయసున్న ఓ బాలికపై కన్నేశాడు. గత కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను.. నీతో మాట్లాడాలి… రూమ్ కి రా అంటూ.. వాట్సాప్ సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. నువ్వు నాకు కావాలి, నా భార్యకు విడాకులు ఇచ్చేస్తా.. అంటూ బాలిక పై ఒత్తిడి తెచ్చాడు. అతని చేష్టలతో ఆందోళనకు గురైన బాలిక.. ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదనకు గురైంది.
Read More : పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ ప్రదీప్ –
అయితే ఇవాళ ఏకంగా బాలిక ఫ్లాట్ కి వెళ్లి రాఘవరావు హల్చల్ చేయడంతో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి ఆందోళన చెందిన ఆ బాలిక.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మద్యం సేవించి, చాకు జేబులో పెట్టుకుని ఆ బాలిక ఫ్లాట్ కి వెళ్ళిన రాఘవరావు.. బాలికను బయటకు రావాలని బెదిరించాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆ బాలిక రాఘవరావుతో వారించడంతో పాటు చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఈ క్రమంలో తనకు మెగా బ్రదర్స్ అండదండలు ఉన్నాయని.. తనని ఎవరూ ఏమి చేయలేరని రాఘవరావు చెప్పాడు.
More Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు జడ్జిమెంట్ కాపీ.. సీఎంకు ఎలా చేరాయి?..ఆధారాలు బహిర్గతం చేయడంపై అసహనం.. –
అతడి నుంచి చాకు లాక్కున్న స్నేహితులు, కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినా రాఘవరావు వినలేదు. దీంతో వారు మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాలిక భద్రత దృష్ట్యా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి …
-
చైనాలో కరోనా మరణ మృదంగం.. ఒక్క వేరియంట్ కాదు నాలుగు వేరింయట్లు కారణం –
-
80 కుటుంబాల సాంఘీక బహిష్కరణ..లబోదిబోమంటున్న బాధితులు –
-
యాంకరింగ్ కు దూరమవుతున్న మళయాళీ సుమ.. కన్నీళ్లు ఆగలేదు –
-
బూస్టర్ డోస్ గా కోవిడ్ నాజల్ వ్యాక్సిన్.. ధర ఎంతో తెలుసా? –
-
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. విభజన సమస్యలు, బకాయిలు, పోలవరంపై చర్చ –
3 Comments